శతశాతం ఓటింగ్‌ లక్ష్యం | Sakshi
Sakshi News home page

శతశాతం ఓటింగ్‌ లక్ష్యం

Published Sun, May 5 2024 5:15 AM

-

విజయనగరం అర్బన్‌: జిల్లాలో శతశాతం ఓటింగ్‌ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్‌ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్‌ బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకునేందు కు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రతి ఓటరు తమ ఓటును నిర్భయంగా వినియోగించు కోవాల ని కోరారు. ఓటర్లకు మరింత వెసులబాటు కల్పించడంలో భాగంగా ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పెంచినట్టు చెప్పారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం స్వీప్‌లో భాగంగా నగరంలోని రాజీవ్‌ స్టేడియం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరు శనివారం నిర్వహించిన రెండు కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌ స్టేడియం వద్ద ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 85 ఏళ్లు వయస్సు నిండిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే తమ ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, మే 7 నుంచి 10వ తేదీ వరకు హోం ఓటింగ్‌ నిర్వ హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఓటు వేయడంపై దృష్టి సారించామన్నారు. పరుగులో పాల్గొన్న వారితో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement
 
Advertisement