హజ్‌ యాత్రికులకు టీకాలు | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులకు టీకాలు

Published Sun, May 5 2024 3:35 AM

హజ్‌

పెద్దపల్లిరూరల్‌: జిల్లా నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే వారికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో టీకాలు వేయించినట్లు అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ తెలిపారు. టీకాల కోసం గతంలో హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చేదని, ఇపుడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. స్థానిక డ యాగ్నస్టిక్‌ హబ్‌ వద్ద శనివారం ఏర్పాటు చేసి న ఈ శిబిరం ద్వారా 22 మంది యాత్రికులకు టీకాలు వేసినట్లు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. ప్రతినిధులు రమాకాంత్‌, శౌరయ్య, కృపాబాయి తదితరులు పాల్గొన్నారు.

ఇంటి వద్దే ఓటు వినియోగం

పెద్దపల్లిరూరల్‌: దివ్యాంగులు, 85ఏళ్ల వయ సు దాటిన వృద్ధులు తమ ఇంటివద్దే ఓటుహ క్కు వినియోగించుకోవాలని, ఇందుకోసం ఎ న్నికల సంఘం మంచి అవకాశం కల్పించింద ని పెద్దపల్లి అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి గంగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన ఇంటివద్ద ఓటుహక్కు వినియోగం ప్రక్రియను శనివారం ఆయన పరిశీలించారు. ఎన్నికల అధికారులు, ఓటర్లకు పలు సూచనలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను ఈనెల 7లోగా వినియోగించుకోవాలని గంగయ్య సూచించారు. ఇందుకోసం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఓటరు ఫెసిలిటేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

‘దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఇవి’

గోదావరిఖని: అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికలు దేశభవిష్యత్‌ను నిర్ణయిస్తాయని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవీ చలపతిరావు అన్నారు. స్థానిక ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పదేళ్ల పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజలు, రాష్ట్రాల హక్కులపై దాడులు తీవ్రమయ్యాయని ఆయన ఆరోపించారు. కార్మికులు, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, ప్ర తిపక్షాలు, ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటరీ సంస్థలు, మైనార్టీలు, ప్రత్యేకంగా ము స్లింలపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు ఐ. కృష్ణ, నరేశ్‌, వెంకన్న, బి.అశోక్‌, చిలుక శంకర్‌, మల్లేశ్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

హజ్‌ యాత్రికులకు టీకాలు
1/2

హజ్‌ యాత్రికులకు టీకాలు

హజ్‌ యాత్రికులకు టీకాలు
2/2

హజ్‌ యాత్రికులకు టీకాలు

Advertisement
Advertisement