ధాన్యంలో కోతలు విధించొద్దు | Sakshi
Sakshi News home page

ధాన్యంలో కోతలు విధించొద్దు

Published Sun, May 5 2024 3:40 AM

ధాన్య

పెద్దపల్లిరూరల్‌: రైతులు పండించిన ధాన్యాన్ని మ ద్దతు ధరతో కొనుగోలు చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ కోతలు విధించవద్దని అడిషనల్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌లాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించేలా రైతులకు సూచించాలని చెప్పారు. కొనుగోలు ప్రక్రియ లో వేగం పెంచాలని అన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల, పౌర సరఫరాల మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు ఉన్నారు.

‘నిజాయతీగా ఓటేస్తాం’

కోల్‌సిటీ(రామగుండం): ‘నిజాయతీగా ఓటేస్తాం’ అని సింగరేణి కార్మికులతో స్వీప్‌ జిల్లా నోడల్‌ అధి కారి రవూఫ్‌కాన్‌, రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌ శ్రీకాంత్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఆర్జీ–1 ప రిధి జీడీకే–2 గనిపై శనివారం నిర్వహించిన ఓటు ప్రాధాన్యతపై వారు అవగాహన కల్పించారు. ప్ర జాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాటలతో అలరించారు. గని మేనేజర్‌ తిరుపతి, ఐసీడీఎస్‌ ప్రతినిధి స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యంలో కోతలు విధించొద్దు
1/1

ధాన్యంలో కోతలు విధించొద్దు

Advertisement
Advertisement