సీను సీతారైంది సాంబడా | Sakshi
Sakshi News home page

సీను సీతారైంది సాంబడా

Published Sun, May 5 2024 7:10 PM

Land Titling Act Spreading false propaganda Boomerangs to TDP

టైట్లింగ్ చట్టం ఎదురు తన్నేసిందిరా

సీఎం ఎదురుదాడితో బిత్తరపోయిన టీడీపీ

కొత్త కుట్రలను వెతుక్కుంటున్న బాబు ముఠా

ఎంతమంది రౌడీలను పెట్టినా హీరో లొంగడం లేదు.. పైగా ఎగిరెగిరి తంతున్నాడు. వచ్చినవాళ్లు వచ్చినట్లే నేలకు కరుచుకుపోతున్నారు.. ఇక ఇలాక్కాదని రావుగోపాలరావుకు కోపం వచ్చింది. బొంబాయి నుంచి జిముంబా అనే పెద్ద దాదాను తీసుకొచ్చాడు. వాడు మామూలు మనిషి కాదు.. పూటకు రెండు గొర్రెలు  వంద గుడ్లు తింటాడు. వాణ్ని ఎవరూ ఎదుర్కోలేరు. అలాంటివాణ్ణి హీరోమీదకు ఉసిగొల్పాడు.. మొదటి రెండు షాట్లు తిన్న హీరో ఇక లేచాడు. కళ్ళలో పడిన దుమ్మును దులిపేసి.. నడుముకు తువాలు చుట్టి జై భజరంగి భళి అంటూ గర్జించాడు.. ఎగిరెగిరి తన్నాడు.. దెబ్బకు జిముంబా కూడా నేల కరిచేసాడు.

ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఇలాగే ఉన్నాయ్..  రావుగోపాలరావు పాత్రలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే హీరో జగన్ మీద రకరకాల వాళ్ళను ప్రయోగిస్తున్నారు... వలంటీర్ల మీద దుమ్ము రేపబోయాడు... అది ఎదురుతన్నింది... వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఆపించాలని చూసాడు... వృద్ధులతో తిట్లు కాసాడు.. ఇంగ్లిష్ మీడియం వద్దన్నాడు.. పేరెంట్స్ తో చీవాట్లు కాసాడు... ఇక ఇలా కాదని ఎక్కడా లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని బయటకు తెచ్చి ఇది వచ్చిందంటే ఇక మీ భూములన్నీ ఉఫ్... జగన్ ఎత్తుకుపోతాడు.. అంటూ తన బ్యాచ్ తో కలిసి తెగ ప్రచారం చేసాడు... పత్రికలూ...మీడియా..చానెళ్లు ఇవన్నీ నాలుగురోజులపాటు  ఇదే పనిమీద ఉన్నాయ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయారు... ఎల్లో మీడియా సంస్థలన్నీ ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకున్నారు... జనాన్ని భయపెట్టేసి కంగారు పెట్టేసి.. వామ్మో వాయ్యో అనేలా చేసి....సంబరపడుతున్న తరుణంలో మెల్లగా సీఎం వైయస్ జగన్ మైక్ అందుకున్నారు.

 చదవండి: కొత్త పగటివేషగాడు వచ్చాడు

అసలు ఆ చట్టం ఆంటే ఏమిటి... దానిలోని లోటుపాట్లు...అంతా చిన్నపిల్లలకు వివరించినట్లు చెప్పారు... లక్షల ఎకరాల చుక్కల భూములను పేదలకు పంచింది మీ జగన్.... లక్షల ఎకరాల పోడు భూముల మీద గిరిజనులకు   హక్కులిచ్చాము... ఇంకా చంద్రబాబు గ్యాంగ్ అడ్డుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా లక్షలమందికి వేలాది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాము...ఇదీ మీ జగన్ నిజాయితీ...ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న ప్రేమ... అలాంటి జగన్ మీ భూములు లాక్కుంటాడా ? ఈ ఐదేళ్ల పాలనలో మీరు జగన్ను ఇదేనా అర్థం చేసుకున్నది... అంటూ వివరించారు. దీంతో జనానికి విషయం అర్థం ఐంది.

అంటే పెన్షన్ల విషయంలో కుట్రపన్నినట్లే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలోనూ చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవపడుతున్నట్లు జనానికి అర్థం ఐంది... దీంతోబాటు అలంటి తప్పుడు ప్రకటనలు..ప్రసంగాలు చేస్తున్నందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్ సీఐడీ కేసు నమోదు చేసింది.

దీంతో ప్రజలకు విషయం అర్థమైంది...అంతేకాకుండా ఆ అంశం ప్రజల మనస్సుల్లోంచి తొలగిపోతూ... జై జగన్ అనే నినాదం వచ్చి చేరుతోంది... దీంతో ఎల్లో మీడియా... చంద్రబాబు క్యాంప్ తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.. ఎంతో ప్లాన్ చేసి ఈ టైట్లింగ్ చట్టం మీద గాయిగాత్తర చేయబోతే ఇలాగయ్యిందేంటిరా సాంబడా అంటూ తండ్రీకొడుకులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.. మనం ఎంత పెద్ద కుట్రపన్నినా అటు జగన్ ఒక్క బాణంతో దాన్ని ఎఱుర్కొంటూనే తిరిగి ఆ వ్యూహం మనకు తగిలేలా చేస్తున్నాడు..ఇలాగైతే ఎలారా సాంబా అని  తండ్రీకొడుకులు కొత్త కుట్రలకు సిద్ధమవుతున్నారు... ఈసారి ఢిల్లీ కాకుండా బీహార్ నుంచి భిక్షు యాదవ్ ను తెచ్చేపనిలో ఉన్నారేమో... చూడాలి.

:::: సిమ్మదిరప్పన్న

Advertisement
Advertisement