ఈ యాత్ర వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రకు సంకేతం: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

ఈ యాత్ర వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రకు సంకేతం: సీఎం జగన్‌

Published Thu, Apr 25 2024 4:10 PM

Memantha Siddham: CM Jagan Speech At Tekkali Public Meeting - Sakshi

సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఈ యాత్ర వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రకు సంకేతం అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సా­యంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ‘‘సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారు. వైఎస్సార్‌ జిల్లా నుంచి శ్రీకాకుళం  వరుకూ జన సముద్రాలే కనిపించాయి. శ్రీకాకుళం జిల్లాలో జన సముద్రం కనిపిస్తోంది. డబుల్‌ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?’’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.

‘‘జగన్‌కు ఓటేస్తేనే.. పథకాలన్నీ కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికి  ముగింపే. పేద ప్రజల గుండుచప్పుడే ఈ సిద్ధం సభ. మూడు పార్టీల కూటమి మోసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలి. ఈ యాత్ర వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రకు సంకేతం. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకే. 175కు 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరుకు జన సునామీ చూశాం. విద్యా, వైద్య, ఆరోగ్యం రంగాల్లో మార్పులు తీసుకువచ్చాం. గ్రామ స్వరాజ్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగు నింపాం. మరో 18  రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధం. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాం. పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు. మంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు. అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పని. ఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూ..’’ అంటూ సీఎం జగన్‌ దుయ్యబట్టారు.

అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్‌ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధం ఉండాలి. చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వను. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు. సంక్షేమ పథకాలను డోర్‌ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానిది. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్‌ లాంటి నిజాయితీపరుడు కావాలా?. చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను. 87 వేల  కోట్ల రుణమాఫీ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది?’’ అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.


 

‘‘పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధం. ఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. 600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం. మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మేనిఫెస్టోలో 99 శాతం హామీలు నెరవేర్చాం. అక్కా చెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం. కరోనా కష్టకాలంలోనూ  ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం​. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?’’ అంటూ సీఎం ధ్వజమెత్తారు. 

సాధ్యం కాని హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు. మీ జగన్‌ మార్క్‌.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది. మీ జగన్‌ మార్క్‌.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుంది. మీ జగన్‌ మార్క్‌.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. మాట మీద నిలబడే మీ జగన్‌ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి. 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు..  చేశాడా?. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు..చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. 10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అన్నాడు..  చేశాడా?. సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?, మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది. ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట నమ్ముతారా?. . ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటూ చంద్రబాబు వస్తున్నాడు’’ అని సీఎం జగన్‌ మండిపడ్డారు.

Advertisement
Advertisement