IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం | Sakshi
Sakshi News home page

IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం

Published Sun, May 5 2024 4:04 PM

IPL 2024: CSK Has Lost The Toss In 10 Matches Out Of First 11 Matches They Played This Season

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను టాస్‌ దరిద్రం వెంటాడుతూ ఉంది. రుతు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏకంగా పదింట టాస్‌ ఓడాడు. పంజాబ్‌తో ఇవాళ (మే 5) జరుగుతున్న మ్యాచ్‌లో మరోసారి టాస్‌ ఓడిన రుతు.. ప్రత్యర్ది ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగాడు.

టాస్‌ విషయంలో ఎన్ని జాగ్రత్తలు (టాస్‌ ప్రాక్టీస్‌) తీసుకుంటున్నా రుతురాజ్‌ వరుసగా టాస్‌ ఓడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటికే 10 మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడిన రుతు ఓ ఆల్‌ టైమ్‌ చెత్త రికార్డును సమం చేశాడు.

ఐపీఎల్‌లో తొలి 11 మ్యాచ్‌ల్లో అత్యధిక సార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌) చెత్త రికార్డును సమం చేశాడు. సంజూ 2022 సీజన్‌లో తొలి 11 మ్యాచ్‌ల్లో 10 సార్లు టాస్‌ ఓడాడు. రాజస్థాన్‌, సీఎస్‌కే తర్వాత తొలి 11 మ్యాచ్‌ల అనంతరం అత్యధిక సార్లు టాస్‌ ఓడిన జట్టుగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ముంబై 2011 సీజన్‌లో తొమ్మిదింట టాస్‌ ఓడింది. 2013 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కూడా తొలి 11 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట టాస్‌ ఓడింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సీఎస్‌కే తొలి 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో రబాడకు క్యాచ్‌ ఇచ్చి ఆజింక్య రహానే (9) ఔట్‌ కాగా.. రుతురాజ్‌ (25), డారిల్‌ మిచెల్‌ (25) క్రీజ్‌లో ఉన్నారు.

తుది జట్లు..

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రన్(కెప్టెన్‌), జితేష్ శర్మ(వికెట్‌కీపర్‌), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్‌), మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్‌పాండే


 

Advertisement
Advertisement