రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్‌ షో | Sakshi
Sakshi News home page

రవీంద్రజాలం... జడేజా ఆల్‌రౌండ్‌ షో

Published Mon, May 6 2024 2:13 AM

Ravindra Jadeja All Round Show Propels CSK To Big Win Over PBKS

జడేజా ఆల్‌రౌండ్‌ షో

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆరో విజయం

28 పరుగులతో ఓడిన పంజాబ్‌ కింగ్స్‌  

ధర్మశాల: ఐపీఎల్‌ టోరీ్నలో వరుసగా ఆరోసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించాలనుకున్న పంజాబ్‌ కింగ్స్‌ ఆశలను రవీంద్ర జడేజా వమ్ము చేశాడు. 2021 నుంచి పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఆరోసారి మాత్రం గెలుపు బావుటా ఎగురవేసింది. ధర్మశాలలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 28 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి గత బుధవారం పంజాబ్‌ చేతిలోనే ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ముందుగా జడేజా 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంతితోనూ మెరిసి 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. 

టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ స్యామ్‌ కరన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు సాధించింది. కెపె్టన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (21 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌), డరైల్‌ మిచెల్‌ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో రాహుల్‌ చహర్‌ వరుస బంతుల్లో రుతురాజ్, శివమ్‌ దూబే (0)లను అవుట్‌ చేయగా... మిచెల్‌ను హర్షల్‌ పటేల్‌ పెవిలియన్‌కు పంపించాడు. 

దాంతో చెన్నై 69/1 నుంచి 75/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో ఇతర బ్యాటర్ల సహకారంతో జడేజా చెన్నైను ఆదుకున్నాడు. జడేజా కీలక ఇన్నింగ్స్‌తో చెన్నై స్కోరు 160 దాటింది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చహర్‌ (3/23), హర్షల్‌ పటేల్‌ (3/24) రాణించారు. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసి ఓడిపోయింది. తుషార్‌ పాండే (2/35) ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో బెయిర్‌స్టో, రోసో లను అవుట్‌ చేసి పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రభ్‌సిమ్రన్, కరన్, అశుతోష్‌లను జడేజా... శశాంక్‌ను సాన్‌ట్నెర్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ గెలుపుపై ఆశలు వదులుకుంది. 

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) రబడ (బి) అర్‌‡్షదీప్‌ 9; రుతురాజ్‌ (సి) జితేశ్‌ (బి) చహర్‌ 32; మిచెల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్‌ 30; శివమ్‌ దూబే (సి) జితేశ్‌ (బి) చహర్‌ 0; మొయిన్‌ అలీ (సి) బెయిర్‌స్టో (బి) స్యామ్‌ కరన్‌ 17; జడేజా (సి) స్యామ్‌ కరన్‌ (బి) అర్‌‡్షదీప్‌ 43; సాన్‌ట్నెర్‌ (సి) స్యామ్‌ కరన్‌ (బి) చహర్‌ 11; శార్దుల్‌ (బి) హర్షల్‌ 17; ధోని (బి) హర్షల్‌ 0; తుషార్‌ (నాటౌట్‌) 0; గ్లీసన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–12, 2–69, 3–69, 4–75, 5–101, 6–122, 7–150, 8–150, 9–164. బౌలింగ్‌: రబడ 3–0–24–0, అర్‌‡్షదీప్‌ 4–0–42–2, స్యామ్‌ కరన్‌ 4–0–34–1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1–0–19–0, రాహుల్‌ చహర్‌ 4–0–23–3, హర్షల్‌ పటేల్‌ 4–0–24–3. 

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) సబ్‌–సమీర్‌ రిజ్వీ (బి) జడేజా 30; బెయిర్‌స్టో (బి) తుషార్‌ 7; రోసో (బి) తుషార్‌ 0; శశాంక్‌ (సి) సిమర్జీత్‌ (బి) సాన్‌ట్నెర్‌ 27; స్యామ్‌ కరన్‌ (సి) సాన్‌ట్నెర్‌ (బి) జడేజా 7; జితేశ్‌ (సి) ధోని (బి) సిమర్జీత్‌ (బి) 0; అశుతోష్‌ శర్మ (సి) సిమర్జీత్‌ (బి) జడేజా 3; బ్రార్‌ (నాటౌట్‌) 17; హర్షల్‌ (సి) సబ్‌–సమీర్‌ రిజ్వీ (బి) సిమర్జీత్‌ 12; చహర్‌ (బి) శార్దుల్‌ 16; రబడ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–62, 4–68, 5–69, 6–77, 7–78, 8–90, 9–117. బౌలింగ్‌: సాన్‌ట్నెర్‌ 3–0–10–1, తుషార్‌ దేశ్‌పాండే 4–0–35–2, గ్లీసన్‌ 4–0–41–0, జడేజా 4–0– 20–3, సిమర్జీత్‌ 3–0–16–2, శార్దుల్‌ 2–0–12–1.

Advertisement
Advertisement