నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ | Sakshi
Sakshi News home page

నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ

Published Mon, May 6 2024 1:20 AM

నాడు – నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళ

● నెల్లూరు రూరల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు సిటీ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు – నేడు పథకంతో ప్రభుత్వ బడులు కొత్త కళ సంతరించుకున్నాయని ఆ పార్టీ నెల్లూరు రూరల్‌ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రూరల్‌ మండలంలోని గమళ్లపాళెం, కల్తీకాలనీ, కోడూరుపాడు ప్రాంతాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్‌ జానా నాగరాజ్‌గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ లేబూరు పరమేశ్వర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆదాల మాట్లాడారు. పార్టీలు మారే నాటకాల రాయుళ్ల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు. కోడూరుపాడు గ్రామానికి ఇప్పటి వరకు రూ.24 కోట్లకు పైబడి నిధులు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయించినట్లు చెప్పారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఆనం విజయకుమార్‌రెడ్డి, ఎంపీపీ బూడిద విజయకుమార్‌ యాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి లంకా రామశివారెడ్డి, రూరల్‌ పరిశీలకుడు మల్లు సుధాకర్‌రెడ్డి, రెండో డివిజన్‌ కార్పొరేటర్‌ పడిగినటి రామ్మోహన్‌ యాదవ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ ఒట్టూరు సుధాకర్‌ యాదవ్‌, వి.సుధాకర్‌రెడ్డి, నాగ శ్రీనివాస్‌రెడ్డి, లేబూరు అమర్నాథ్‌రెడ్డి, బొమ్మి శ్రీనివాసులురెడ్డి, బొమ్మి వెంకటరెడ్డి, షేక్‌ మౌలా, సొసైటీ అధ్యక్షుడు నడవటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement