‘బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవు’ | Sakshi
Sakshi News home page

‘బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవు’

Published Sun, May 5 2024 4:20 AM

‘బెల్

శ్రీకాకుళం క్రైమ్‌ : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గానీ, ఇతర రాష్ట్రాల మద్యాన్ని గానీ గ్రామాలు, వార్డుల్లోకి తీసుకువెళ్లి బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ (ఈఎస్‌) బి.సుబ్బారావు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరా కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా శుక్రవారం జిల్లాలో ఆరు కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశామని, రూ. 10 వేల విలువ గల 15 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఈఎస్‌ సుబ్బారావు అన్నారు. అరెస్టయిన ఆరుగురూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుగోలు చేసి వాటిని బెల్టుషాపుల్లో నిల్వ చేసి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. బెల్టుషాపులు నిర్వహించేవారిపై ఎక్సైజ్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో విభాగాలు సంయుక్తంగా దాడులు చేసి కేసులు బుక్‌ చేసి రిమాండ్‌ విధించడమే కాక పెనాల్టీ విధిస్తామని తెలిపారు.

‘ప్రేరణ’లో విద్యార్థుల ప్రతిభ

సరుబుజ్జిలి: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలో గల జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఏప్రిల్‌ 19న జరిగిన జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవం (డ్రాయింగ్‌, వ్యాసరచన) పోటీల్లో టెక్కలి జెడ్పీ హైస్కూ ల్‌ విద్యార్థి లమ్మట అఖిల్‌ (9వ, తరగతి), శ్రీకాకుళానికి చెందిన మైత్రిముంజి (10వ తరగతి) అనే విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచారు. వీరిద్దరూ ఫైనల్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యారని జవహర్‌ నవోదయ ప్రిన్సిపాల్‌ డి.పరశురామయ్య, లక్ష్మీనారాయణలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీరికి గుజరాత్‌లోని వాడ్నగర్‌లో ఏడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

కేంద్రం పరిశీలన

పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లోని నాలుగు పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ శనివారం పరిశీలించారు. పోలింగ్‌ పనితీనును ఆర్వో అప్పారావు ను అడిగి తెలుసుకున్నారు. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు మండలానికి ఒక్కో పోలింగ్‌ కేంద్రం, హిరమండలం, ఎల్‌.ఎన్‌ పేట మండలాలకు కలిపి ఒక పోలింగ్‌ కేంద్రం కేటాయించారు. మొదటి రోజు పీఓ, ఏపీఓలు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. అలాగే మార్కెట్‌ యార్డు గోడౌన్‌లో నిర్వహిస్తున్న ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియను కూడా కలెక్టర్‌ పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ నల్లి సాయి, తహసీల్దార్‌ ప్రసాదరావు పాల్గొన్నారు.

‘బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవు’
1/1

‘బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు తప్పవు’

Advertisement
 
Advertisement