కొనసాగుతున్న ‘పోస్టల్‌’ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ‘పోస్టల్‌’ ఓటింగ్‌

Published Mon, May 6 2024 10:05 AM

కొనసాగుతున్న ‘పోస్టల్‌’ ఓటింగ్‌

హుజూర్‌నగర్‌: ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ముందస్తుగా ఓటు వేసేందుకు అవకాశం ప్రతి ఎన్నికల్లోనూ కలిస్తున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్‌ ఎన్నికలను పురస్కరించుకొని పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ముందస్తు పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరు ఓటు వేసేందుకు హుజూర్‌నగర్‌ పట్టణంలోని వీవీఎం హైస్కూల్‌లో రెండు కౌంటర్లు, సూర్యాపేటలో ఆరు కేంద్రాలు, కోదాడలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లు ఈనెల 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు ఈ కౌంటర్లలో ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉంటారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు

8,344 మంది ఉద్యోగుల నమోదు

ఎన్నికల విధుల్లో పాల్గొనే వారంతా నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎనన్‌ఐసీ) పోర్టల్‌లో 12 ఫారం అప్‌లోడ్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే 8,344 మంది ఉద్యోగులు పోస్టల్‌ ఓటింగ్‌కు నమోదు చేసుకున్నారు. ఇందులో సూర్యాపేట నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్‌కు 2944 మంది, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో 2,800 మంది, కోదాడ నియోజకవర్గంలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆదివారం వరకు హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో 396 మంది, సూర్యాపేటలో 716 మంది, కోదాడలో 573 మంది ఉద్యోగులు మొత్తం 1685 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 8వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.

ఫ ఇప్పటివరకు ఓటు వేసిన

1,685 మంది ఉద్యోగులు

ఫ 8వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement