40 ఏళ్ల నవనవలాడే నాయకి | Sakshi
Sakshi News home page

40 ఏళ్ల నవనవలాడే నాయకి

Published Sun, May 5 2024 6:45 AM

-

తమిళసినిమా: కళామతల్లి ముద్దుబిడ్డ నటి త్రిష. 25 వసంతాలుగా కథానాయకిగా రాణిస్తున్న అరుదైన నటి ఈమె. శనివారం త్రిష 40వ పుట్టిన రోజు. దీంతో భాషా బేధం లేకుండా వెల్లువెత్తిన శుభాకాంక్షల్లో ఆమె తడిసి ముద్దయ్యారు ఈ చైన్నె సుందరి. త్రిష విజయ పయనాన్ని ఒక్కసారి తిరగేస్తే మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరకు పరిచయం అయిన బ్యూటీ ఈ జాణ. 1999లో ప్రశాంత్‌, సి మ్రాన్‌ జంటగా నటించిన జోడి చిత్రంలో చిన్న పాత్రలో మెరిసిన నటి త్రిష. ఆ తరువాత కొంత పోరాటం అనంతరం 2002లో మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యారు. అమీర్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో సూర్య కథానాయకుడు. తొలి చిత్రంతోనే విజయానందాన్ని పొందిన త్రిషకి కెరీర్‌ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఆ తరువాత విక్రమ్‌తో జత కట్టిన సామి చిత్రం త్రిషను స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. అలా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, మధ్యలో హిందీలోనూ ఎంట్రీ ఇచ్చి ఆ ముచ్చటా తీర్చుకున్నా రు. కాగా కథానాయకిగా 25 ఏళ్లు గా విజయ ప్రస్థానాన్ని కొనసాగి స్తున్న నటి త్రిష. ఇది అరుదైన వి షయమే. ఎందుకంటే త్రిషతో పా టు కథానాయకిగా పయనించిన పలువురు నటీమణులు ఇ ప్పుడు అక్క, వదిన, అమ్మ పాత్రల్లో నటిస్తున్నారు. త్రిష మాత్రం ఒక్క త మిళంలోనే కాకుండా, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో అగ్ర కథానాయకిగా రాణిస్తున్నా రు. కెరీర్‌లో ఎత్తు పల్లాలు అన్నవి సహజం. అపజయాలనేవి కొన్నిసార్లు త్రిష కెరీర్‌ను వెక్కిరించాయి. అయితే అలాంటి వాటిని ఎదుర్కొని నిలబడిన 40 ఏళ్ల నవనవ లాడే నాయకి త్రిష. ఈమె కెరీర్‌ దిగజారిపోతోంది అనుకునే సమయంలో మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం అవకాశం పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. అంతే కాదు అంత కంటే ఎక్కువ పారితోషికం అందుకునేలా చేసింది. ఇప్పుడీ పరువాల ప్రౌడ రూ. 10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల విజయ్‌ సరసన లియో చిత్రంలో నటించిన త్రిష తాజాగా అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్‌తో థగ్స్‌ లైఫ్‌, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్‌, టోవినో థామస్‌ సరసన ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేనంత బిజీగా ఉన్నారు. ఇలా నాలుగు పదుల వయసులోనూ నాటౌట్‌ కథానాయకిగా కొనసాగడం త్రిషకే సాధ్యం అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ ఇప్పటికీ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అన్నది గమనార్హం.

నటి త్రిష

Advertisement
Advertisement