నొచ్చిలి రహదారిపై మహిళల రాస్తారోకో | Sakshi
Sakshi News home page

నొచ్చిలి రహదారిపై మహిళల రాస్తారోకో

Published Sun, May 5 2024 6:45 AM

నొచ్చిలి రహదారిపై మహిళల రాస్తారోకో

తిరుత్తణి: తమ గ్రామంలో నీటి సమస్య పరిష్క రించలేదని వీసీఆర్‌ కండ్రిగ మహిళలు శనివారం నొచ్చిలి రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తిరుత్తణి యూనియన్‌ చిరుగుమి పంచాయతీలో ని వీసీఆర్‌ కండ్రిగలో వందకు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. గ్రామంలోని బోర్‌వెల్‌ నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వేసవిలో ఎండల తీవ్రత పెరిగిన నేపఽథ్యంలో భూగర్భజలా లు అడుగంటి పోయాయి. దీంతో బోర్‌వెల్‌ ఎండి పోయి తాగునీటి సమస్య నెలకొంది. పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఈ విషయమై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినా పంచాయ తీ సర్పంచ్‌ నీటి సమస్య పరిష్కారం గురించి ప ట్టించుకోలేదు. దీంతో నీటి సమస్య మరింత తీ వ్రం అయ్యింది. దీంతో ఆగ్రహించిన మహిళలు 100 మంది గ్రామానికి సమీపంలోని కేజీ కండ్రిగ, నొచ్చిలి రాష్ట్ర రహదారిలో రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోతో ఆ మార్గంలో అర్ధగంట పాటు రాక పోకలు స్తంభించాయి. పంచాయతీ సర్పంచ్‌ లక్ష్మి భర్త వడివేలు గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేయగా అతనితో మహిళలు వాగ్వాదానికి దిగా రు. బీడీఓ కార్యాలయ అధికారులు హామీ మేరకు మహిళలు రాస్తారోకో విరమించారు.

Advertisement
Advertisement