తమిళసినిమా: నటుడు సంతానం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇంగ నాన్ దాన్ కింగ్. నటి ప్రియాలయ నాయకిగా నటించిన ఇందులో నటుడు తంబిరామయ్య, కూల్ సురేశ్ తదితరులు ముఖ్య పా త్రలు పోషించారు. గోపురం ఫిలింస్ పతాకంపై అన్బుచెలియన్ సమర్పణలో ఆయన వారసురాలు సుష్మిత నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహించారు. డీ.ఇమాన్ సంగీతం అందించిన ఇంగ నాన్‌దాన్ కింగ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్బుచెలియన్ మాట్లాడుతూ నటుడు సంతానం హీరోగా చిత్రం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, అది ఈ చిత్రం ద్వారా నెరవేరడం సంతోషంగా ఉందని అన్నారు. అందరూ ఆనందించే వినోద భరిత కథా చిత్రంగా ఇంగ నాన్‌దాన్ కింగ్ చిత్రం ఉంటుందని ఆయన చెప్పారు. చిత్ర కథానాయకుడు సంతానం మాట్లాడుతూ ఇంగ నాన్‌దాన్ కింగ్ చిత్రానికి తాను హీరోనని, అయితే ఈ చిత్ర సమర్పకుడు అన్బుచెలియన్ మాత్రం తమిళనాడుకే హీరో అని పేర్కొన్నారు. ఆయన కార్యాలయానికి వెళ్లని హీరోనే లేరన్నారు. ఒకసారి తాను కూడా ఆయన ఆఫీస్‌కు డబ్బు కోసం వెళ్లానన్నారు. ఇల్లు కొ నడానికి అప్పు అడిగానని, అందుకాయన అప్పు చేసి ఇల్లు కొనడం అంత శ్రేయస్కరం కాదని హితవు పలి కి, తాను డబ్బు ఇస్తాను దాన్ని మీరు హీరోగా నటించే తన చిత్రానికి అడ్వాన్స్‌గా పెట్టుకోండి అని చెప్పారన్నారు. అలా ఈ చిత్రం మొదలయ్యిందని సంతా నం చెప్పారు. ఆయనతో కలిసి ఈ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా తాను హీరోగా నటించిన చిత్రం ద్వారా అన్బుచెలియన్ వారసురాలు సుష్మిత నిర్మాతగా మారడం మరింత సంతోషంగా ఉందనే భావాన్ని సంతానం వ్యక్తం చేశారు. లాజిక్‌లు వెతక కుండా చూసి ఎంజాయ్ చేసే కథా చిత్రం ఇంగ నాన్ దాన్ కింగ్ అని సంతానం చెప్పారు.
తమిళనాడుకే పెద్ద హీరో ‘అన్బుచెలియన్’
Published Sun, May 5 2024 6:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- చత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్‌వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్‌రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
Advertisement