Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

YSRCP Alleges AP Police EC Targets MLA Pinnelli
టార్గెట్‌ పిన్నెల్లి

గుంటూరు,సాక్షి: నాలుగు సార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రాణాలకు రక్షణ కరువైంది. ఒక కేసు నుంచి ఊరట దొరికిందని అనుకునేలోపు.. మూడు తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌ చేసే యత్నాలు చేస్తున్నారు. అం‍తేకాదు సదరు ఎమ్మెల్యేను హతమార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది వైఎస్సార్‌సీపీ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఒకదాని వెంట ఒకటి వరుస కేసులు పెడుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఈవీఎం ఘటన కేసులో హైకోర్టు ఆయనకు ఊరట లభించగా.. ఆయన్ని ఎలాగైనా అరెస్ట్‌ చేయాలని కంకణం కట్టుకున్న పోలీసులు మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టారు. అయితే ఈ పరిణామాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏదో ఒకలా ఆయన్ని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇదంతా అని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసాత్మ ఘటనలను.. తదనంతర పరిణామాలను చూసిన ఎవరికైనా కొన్ని అనుమానాలు రావడం సహజం. అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీస్‌ శాఖ ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి అనుబంధ సంఘాలుగా మారాయి ఏమో అనిపించకమానదు. దీనికి తోడు పిన్నెల్లిని లక్ష్యంగా చేసుకుని పచ్చ బ్యాచ్‌ పన్నుతున్న కుట్రలు చూస్తున్నదే. అయితే దీని వెనుక కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌సీపీ అనుమానిస్తోంది. సీఐ నారాయణస్వామిచౌదరి ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తోంది. వైఎస్సార్‌సీపీ సూటి ప్రశ్నలుమాచర్లలో ఎన్నికల హింసకు సంబంధించి ఎస్సీ, డీఎస్పీ, ఎస్సై సస్పెండైనా ఐజీ త్రిపాఠీకి సన్నిహితుడైన సీఐ నారాయణస్వామిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?. గతంలో కారంపూడి ఎస్సైగా ఉన్నప్పుడు అత్యంత వివాదాస్పంగా వ్యవహరించి సస్పెన్షన్‌కు గురైన నారాయణస్వామిని సీఐగా ఎలా నియమిస్తారు? ఆయన వ్యవహార శైలిపై గత నెల(ఏప్రిల్‌) 8నే ఎమ్మెల్యే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఈసీ ఎందుకు పట్టించుకోలేదు? ఎన్నికల వ్యవస్థ, పోలీసు వ్యవస్థలు టీడీపీకి లొంగిపోయాయేమో అనిపిస్తోంది. పిన్నెల్లిపై కక్ష కట్టి తప్పుడు కేసులు బనాయిస్తున్నాయి :::వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏదైనా హాని జరిగితే సీఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠిదే బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేసింది. పోలీస్‌ వ్యవస్థకు మాయని మచ్చలా కొందరు అధికారులు తయారు అయ్యారని, వైఎస్సార్‌సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, టీడీపీ కూటమికి కొమ్ము కాస్తున్న అధికారులు జూన్‌ 4 ఎన్నికల పలితాల మూల్యం చెల్లించుకోక తప్పదని సున్నితంగా హెచ్చరిస్తోంది కూడా.

Warangal and Khammam and Nalgonda Graduate MLC bypoll Updates In Telugu
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్‌

Updates పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోందిమూడు ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు వరంగల్:హన్మకొండ పింగిలి కళాశాల పోలింగ్ బూతులో ఓట్లు వేయడానికి క్యూలో ఉన్న పట్టభద్రులు నల్లగొండ:మిర్యాలగూడ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు వరంగల్:పట్టభద్రుల ఉప ఎ‍న్నిక పోలింగ్‌ కొనసాగుతోందిహనుమకొండ పింగళి కాలేజీ పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోందిసూర్యాపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైందిఓటు వేయడానికి పట్టభద్రులు తరలి వసున్నారు ఓటు వేయడానికి క్యూలైన్‌లో నిల్చున్నారు నల్లగొండ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రారంభం అయిన పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ వరంగల్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభంవరంగల్- నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులువరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,73,413 మంది ఓటర్లు ఉన్నారువీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు 296 బ్యాలెట్ బాక్స్ లు అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌నేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో తరలి వెళ్ళిన సిబ్బంది, అధికారులుసోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బరిలో 52 మంది ఉన్నా... ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు.605 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.మొత్తం 4,63,839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34 అసెంబ్లీ నియోజక వర్గాలలో విస్తరించి ఉంది ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం.వరంగల్ ఉమ్మడి జిల్లాలో 1,73,406 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 1,23,985 మంది ఓటర్లునల్గొండ ఉమ్మడి జిల్లాలో 1,66,448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లుపట్టభద్రులను ఆకట్టుకునే పనిలో మూడు ప్రధానపార్టీల అభ్యర్థుల ప్రచారంఉదయం 6 నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలుఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.ఈరోజు తేదిన ప్రత్యేక సెలవువరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధి 34అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించి ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లు

IPL 2024: Sunil Narine Becomes The First Player To Win MVP Award Thrice In IPL History
IPL 2024: 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

కేకేఆర్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ ఎవరికీ సాధ్యంకాని అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడి అవార్డు (MVP) అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 2012.. తన డెబ్యూ సీజన్‌లో తొలిసారి ఈ అవార్డు అందుకున్న నరైన్‌.. 2018 సీజన్‌లో.. తాజాగా 2024 సీజన్‌లో అత్యంత విలువైన ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టిన నరైన్‌.. 2018 సీజన్‌లో 357 పరుగులు, 17 వికెట్లు.. 2012 సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టాడు.ఈ సీజన్‌లో మెంటార్‌ గంభీర్‌ చొరవతో ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన నరైన్‌.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో నరైన్‌ బ్యాట్‌ నుంచి సెంచరీ, 3 అర్దసెంచరీలు జాలువారాయి. సీజన్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నరైన్‌ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో నరైన్‌ బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 11వ స్థానంలో నిలిచాడు.ఇదిలా ఉంటే, కేకేఆర్‌ ఐపీఎల్‌లో తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. నిన్న (మే 26) జరిగిన 2024 సీజన్‌ ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మిచెల్‌ స్టార్క్‌ (3-0-14-2, 2 క్యాచ్‌లు) ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్‌ శర్మ (2), ట్రివిస్‌ హెడ్‌ (0) దారుణంగా విఫలమయ్యారు. కమిన్స్‌ కాకుండా మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్‌ (2.3-0-19-3), హర్షిత్‌ రాణా (4-1-24-2), సునీల్‌ నరైన్‌ (4-0-16-1), వరుణ్‌ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్‌ నరైన్‌ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది.

AP Elections 2024: May 27th Political Updates In Telugu
May 27th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates..8:50 AM, May 27th, 2024బరితెగించిన పచ్చ గూండాలు..ఎన్నికల్లో ఓటమి భయంతో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలుపోలింగ్‌ జరిగిన మరుసటి రోజే వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టారు. ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులుపోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024 7:45 AM, May 27th, 2024పిన్నెళ్లిపై పోలీసుల అక్రమ కేసులు..తాడేపల్లి..మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులుఎమ్మెల్యే అరెస్టే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులుటీడీపీకి అనుబంధ సంఘాలుగా మారిన ఈసీ, పోలీసు శాఖఈవీఎం కేసులో బెయిల్ రాగానే వెంటనే మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులుసీఐ నారాయణస్వామి చౌదరి ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతోందన్న వైఎస్సార్‌సీపీఏదోలా ఎమ్మెల్యే పిన్నెళ్లిని అరెస్టు చేసి హతమార్చేందుకే కుట్రలంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు 7:00 AM, May 27th, 2024ఓటు తెచ్చిన చేటు..కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గంసాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటందశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపువ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులునారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరంఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవంనీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులుఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదనఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు 6:50 AM, May 27th, 2024సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరించొద్దుడిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండిడిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు 6:40 AM, May 27th, 2024‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండిఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు 6:30 AM, May 27th, 2024తాపీగా తప్పుడు కేసులుపిన్నెల్లికి బెయిల్‌ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?

Upcoming OTT Release Movies In Telugu On May Last Week 2024
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్

మరో వారం వచ్చేసింది. చాలారోజులుగా డల్‌గా ఉన్న థియేటర్లలోకి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై మంచి బజ్ ఉంది. 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' మూవీస్ కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి. వీటిలో ఏవి హిట్ అవుతాయనే సంగతి పక్కనబెడితే ఓటీటీలో కూడా 19 వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలేం లేవు. 'పంచాయత్' అనే హిందీ సిరీస్, 'వీర్ సావర్కర్' అనే హిందీ మూవీ మాత్రమే ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. మరికొన్ని హిందీ చిత్రాలు-సిరీసులు ఉన్నాయి గానీ రిలీజైతే గానీ వాటి టాక్ చెప్పలేం. అలానే ఈ వీకెండ్‌లో తెలుగు మూవీస్ ఏమైనా సడన్‌గా స్ట్రీమింగ్‌కి వస్తాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం రాబోతున్న మూవీస్ ఏంటో తెలుసా?ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ మూవీస్ జాబితా (మే 27 - జూన్ 02 వరకు)అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28హాట్‌స్టార్కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31నెట్‌ఫ్లిక్స్ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01జియో సినిమాఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ మూవీ) - మే 28హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లేపొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

Cyclone Remal slams into Bangladesh coast
తీరం దాటిన రెమాల్‌.. ఇక భగభగలే!

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపానుగా బల­పడిన రెమాల్‌ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్‌డీ­ఆర్‌­ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుపాన్‌ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా.. దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది.దీనికితోడు ఏపీ, యానాంలో పశ్చిమదిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే రెండురోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడు­తుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవు­తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.రెండురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కని­పిస్తు­న్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశా­న్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు అవకా­శాలు కనిపిస్తు­న్నా­­యని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు రెమాల్‌ తుపాను ముప్పు తప్పినప్పటికీ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు(జూన్‌ 3దాకా) ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Lok Sabha Election 2024: Voting to be held on 13 seats of UP on June 1 in 7th phase of elections
Lok Sabha Election 2024: యూపీలో ఆఖరి పోరాటం!

ఉత్తరప్రదేశ్‌లో సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ఆఖరి అంకానికి చేరుకుంది. 6 విడతల్లో 67 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. మిగతా 13 సీట్లలో జూన్‌ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్‌ జరగనుంది. 2019లో వీటిలో 11 స్థానాలు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కైవసం కాగా బీఎస్పీకి 2 దక్కాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, సీఎం యోగి కంచుకోట గోరఖ్‌పూర్‌ సహా కీలక నియోజవర్గాలపై ఫోకస్‌... గోరఖ్‌పూర్‌... భోజ్‌పురీ వార్‌ సుప్రసిద్ధ గోరఖ్‌నాథ్‌ ఆలయానికి నెలవు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోట. ఆయన గురువు మహంత్‌ అవైద్యనాథ్‌ 1989 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. తర్వాత యోగి 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు నెగ్గారు. ఆయన సీఎం కావడంతో జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా ఎస్పీ గెలిచినా 2019లో బీజేపీ ప్రముఖ భోజ్‌పురి నటుడు రవికిషన్‌ను బరిలోకి దించి 3 లక్షల మెజారిటీతో కాషాయ జెండా ఎగరేసింది. ఈసారీ ఆయనే పోటీలో ఉన్నారు. ఎస్పీ నుంచి భోజ్‌పురి నటి కాజల్‌ నిషాద్, బీఎస్పీ నుంచి జావెద్‌ సిమ్నాని బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ దన్నుతో బీజేపీకి ఎస్పీ గట్టి పోటీ ఇస్తోంది.గాజీపూర్‌.. త్రిముఖ పోరు ఇక్కడ 2014లో బీజేపీ, 2019లో ఎస్పీ గెలిచాయి. ఎస్సీ నుంచి అఫ్జల్‌ అన్సారీ, బీఎస్పీ నుంచి ఉమేశ్‌ సింగ్, బీజేపీ నుంచి పరాస్‌ నాథ్‌ రాయ్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ 20 శాతం ఎస్సీలు, 11 శాతం ముస్లింలు ఉంటారు. ఓటర్లు ఒక్కోసారి ఒక్కో పారీ్టకి పట్టం కడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. గాజీపూర్‌ పరిధిలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 ఎస్పీ చేతిలోనే ఉన్నాయి!వారణాసి... మోదీ హ్యాట్రిక్‌ గురికాశీ విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ లోక్‌సభ స్థానంలో 1991 నుంచి కమలనాథులు పాతుకుపోయారు. 2004లో కాంగ్రెస్‌ నెగ్గినా 2009లో బీజేపీ దిగ్గజం మురళీ మనోహర్‌ జోషి గెలుపొందారు. 2014లో ప్రధాని అభ్యరి్థగా నరేంద్ర మోదీ ఇక్కడ తొలిసారి బరిలో దిగారు. ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3.7 లక్షలకు పైగా మెజారిటీతో గెలిచారు. 2019లో మెజారిటీని 4.8 లక్షలకు పెంచుకున్నారు. ఈసారి హ్యాట్రిక్‌ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున పీసీసీ చీఫ్‌ అజయ్‌ రాయ్, బీఎస్పీ నుంచి అథర్‌ జమాల్‌ లారీ రేసులో ఉన్నారు. ఈసారి మోదీ మెజారిటీ పెరుగుతుందా, లేదా అన్నదే ప్రశ్నగా కనిపిస్తోంది.చందౌలీ... టఫ్‌ ఫైట్‌ దేశంలోనే అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో ఒకటి. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువ. 2014, 2019ల్లో మోదీ వేవ్‌లో బీజేపీ ఖాతాలో పడింది. సిట్టింగ్‌ ఎంపీ మహేంద్రనాథ్‌ పాండే ఈసారి హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. ఎస్పీ నుంచి వీరేంద్ర సింగ్, బీఎస్పీ నుంచి సత్యేంద్రకుమార్‌ మౌర్య పోటీలో ఉన్నారు. బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది.మీర్జాపూర్‌... ప్రాంతీయ పారీ్టల హవాఒకప్పుడు బందిపోటు రాణి పూలన్‌ దేవి అడ్డా. 1996, 1999లో ఆమె ఎస్పీ తరఫున విజయం సాధించారు! 2001లో ఆమె హత్యానంతరం బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. 2014లో అప్నాదళ్‌ నుంచి అనుప్రియా పటేల్‌ ఘనవిజయం సాధించారు. 2016లో పార్టీ బహిష్కరణతో అప్నాదళ్‌(ఎస్‌) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్డీఏ దన్నుతో 2019లో మళ్లీ నెగ్గారు. ఈసారి కూడా ఎన్డీఏ నుంచి బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి రమేశ్‌ చంద్ర బిండ్, ఎస్పీ తరఫున మనీశ్‌ తివారీ రేసులో ఉన్నారు. మీర్జాపూర్‌లో వెనకబడిన వర్గాలు 49 శాతం, ఎస్సీ, ఎస్టీలు 25 శాతం ఉంటారు.కుషీనగర్‌... హోరాహోరీగౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం (శరీర త్యాగం) చేసిన చోటు కావడంతో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు, పర్యాటకులు ఏటా భారీగా వస్తుంటారు. 2008లో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్‌ బోణీ కొట్టగా 2014, 2019ల్లో బీజేపీ పాగా వేసింది. సిట్టింగ్‌ ఎంపీ విజయ్‌ కుమర్‌ దూబే ఈసారీ బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి అజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ (పింటూ). బీఎస్పీ నుంచి శుభ్‌ నారాయణ్‌ చౌహాన్‌ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి.పోలింగ్‌ జరిగే మొత్తం స్థానాలు...మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవరియా, బన్స్‌గావ్‌ (ఎస్సీ), ఘోసి, సలేంపూర్, బలియా, ఘాజిపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్‌ (ఎస్సీ)– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

IPL 2024 Final, KKR vs SRH: All The Player Of The Match Award Names Of KKR In IPL Finals Start With M
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్‌ స్టార్క్‌ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్‌ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్‌ చరిత్రలో నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్‌ చరిత్ర సృష్టించాడు. స్టార్క్‌ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్‌లోనూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్‌ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్‌ అత్యంత కీలకమైన నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్‌లో స్టార్క్‌ సన్‌రైజర్స్‌ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్‌ ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్‌ బిస్లా, 2014లో మనీశ్‌ పాండే, తాజాగా మిచెల్‌ స్టార్క్‌ ఫైనల్స్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్‌ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్‌ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్‌ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ మిచెల్‌ స్టార్క్‌ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ కమిన్స్‌ (24) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్‌ శర్మ (2), ట్రివిస్‌ హెడ్‌ (0) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్‌ కాకుండా మార్క్రమ్‌ (20), నితీశ్‌ రెడ్డి (13), క్లాసెన్‌ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్‌ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్‌ (2.3-0-19-3), హర్షిత్‌ రాణా (4-1-24-2), సునీల్‌ నరైన్‌ (4-0-16-1), వరుణ్‌ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్‌ అరోరా ఓ వికెట్‌ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్‌ నరైన్‌ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్‌ అయ్యర్‌తో పాటు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ దక్కింది. సిరీస్‌ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్‌ నరైన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది.

Today Horoscope: Rasi Phalalu 27-05-2024 In Telugu
ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి కీలక సమాచారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.చవితి సా.4.44 వరకు, తదుపరి పంచమి నక్షత్రం: పుర్వాషాఢ ఉ.10.25 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.6.11 నుండి 7.44 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.15 వరకు తదుపరి ప.2.58 నుండి 3.50 వరకు, అమృతఘడియలు: ఉ.5.41 నుండి 7.15 వరకు, తదుపరి రా.3.31 నుండి 5.05 వరకు. మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.వృషభం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.కర్కాటకం: పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ప్రోత్సాహం. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి ఉంటుంది.సింహం: సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం. కన్య: రుణభారం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.తుల: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో అనుకూలత.వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.ధనుస్సు: పనులు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వాహనయోగం.మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.కుంభం: నూతన మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.మీనం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. సమస్యలు తీరతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement