విజయవాడ రోడ్డును వెంటనే విస్తరించాలి | Sakshi
Sakshi News home page

విజయవాడ రోడ్డును వెంటనే విస్తరించాలి

Published Sat, May 18 2024 4:36 AM

Vijayawada road should be widened immediately: Komati Reddy Venkat Reddy

ఆలస్యమయ్యేకొద్దీ ప్రమాదాలతో ప్రాణనష్టం పెరుగుతుంది

ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల ప్రారంభంలో జాప్యం సరికాదు

అధికారులతో సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై 17 ప్రాంతాల్లో ఉన్న బ్లాక్‌ స్పాట్స్‌ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణనష్టం జరుగుతున్నందున ఆ రోడ్డును వీలైనంత తొందరలో విస్తరించాల్సిన అవసరం ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రె డ్డి పేర్కొన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న లోపాలను ముందుగా మరమ్మతు చేయాలని అధి కారులను ఆదేశించారు. మరమ్మతులతో వాహనా లకు ఇబ్బంది ఎదురుకాకుండా, ముందుగా ప్రత్యా మ్నాయ మార్గం ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని సూచించారు. అధికారిక అనుమతుల పేరిట ఇంకా జాప్యం చేస్తే ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని పేర్కొ న్నారు. 

శుక్రవారం ఆయన ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహæదారుల విభాగం అధికారులతో సమీక్షించారు. విజయవాడ రహæదారిపై ప్రమాదాలు జరుగు తున్న చోట్ల వాహనచోదకులు గమనించేలా హెచ్చరిక, సూచిక బోర్డుల ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అతివేగం నియంత్రణ చర్యలు చేపట్టడం, అవసరమైన ప్రాంతాల్లో ఆరు వరుసలకు రోడ్డును విస్తరించటం, కావాల్సిన చోట్ల వెహికిల్‌ అండర్‌ పాస్‌లు, రెండు వైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం వంటి చేపట్టాలని తెలిపారు. 2021లో మంజూరైన రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులు ఈ పాటికే ప్రారంభమై ఉంటే అది ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసి ఉండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. 

రీజినల్‌ రింగురోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి 70 శాతం భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని, అటవీ భూములు, కోర్టు కేసుల వల్ల మిగతా దానిలో జాప్యం జరుగుతోందని ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్‌ అధికారి రజాక్‌ మంత్రి దృష్టికి తెచ్చారు. సమావేశంలో రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్రబోయీ, ఈఎన్‌సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement