ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తెచ్చిందే కేంద్రం | Sakshi
Sakshi News home page

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తెచ్చిందే కేంద్రం

Published Mon, May 6 2024 2:15 AM

ల్యాం

● అవ్వాతాతల గోష్ట చంద్రబాబు, పవన్‌కు తగులుతుంది ● ఆరణి శ్రీనివాసులు మెదడు కోడిపుంజు మెదడు ● కూటమికి ప్రజామద్దతు లేకే కార్పొరేటర్లకు వల ● ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన, ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ధ్వజం

తిరుపతి మంగళం : కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు పట్టుకుని ఆ యాక్ట్‌ వస్తే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల భూములను లాక్కుంటారంటూ విషప్రచారం సృష్టిస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. ఆ యాక్ట్‌ తెచ్చిందే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే కూటమి అన్న విషయాన్ని పక్కనబెట్టి వారు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ జగనన్నపైన బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి 4, 5 డివిజన్లలో ఆదివారం కార్పొరేటర్‌ పుల్లూరు అమరనాథ్‌రెడ్డి, కో–ఆప్షన్‌ సభ్యురాలు రుద్రరాజు శ్రీదేవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీ మద్దిల గురుమూర్తి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ రాజకీయ పరిణతిలేని వ్యక్తి సభ్యసమాజం తలదించుకునేలా, ఓ బజారు మనిషిలాగ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై నోరుపారేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌కళ్యాణ్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాజకీయమంటే డైలాగులు, బూతులు మాట్లాడే సినిమా కాదని హెచ్చరించారు. ఇంటి వద్ద అవ్వాతాతలకు పింఛన్లు అందకుండా చేసిన దుర్మార్గులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ అని మండిపడ్డారు. తిరుపతిలో కోడిపుంజు మెదడంత మెదడు ఉన్న కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చిత్తూరును ఏలి దోచుకున్నది చాలక తిరుపతిని దోచుకోవడానికి వచ్చారని ఆరోపించారు. ప్రజలకు ఏమి చేస్తారో చెప్పి ఓట్లు అడగాల్సిన ఆరణి .. ఎంతసేపు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఎలాగైన అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ను భూతద్దంలో చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రవేశపెట్టిని మేనిఫెస్టోను దేశ ప్రధాని నరేంద్రమోదీనే అంగీకరించలేదన్నారు. తిరుపతిలో ఎవ్వరీకి సాధ్యం కాని విధంగా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం అభినయ్‌ వల్లేనన్నారు. జగనన్న అందించిన సంక్షేమం, తిరుపతిలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేగా అభినయ్‌కి, ఎంపీగా తనకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తెచ్చిందే కేంద్రం
1/2

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తెచ్చిందే కేంద్రం

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తెచ్చిందే కేంద్రం
2/2

ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ తెచ్చిందే కేంద్రం

Advertisement

తప్పక చదవండి

Advertisement