చిరు జల్లులతో ఉపశమనం | Sakshi
Sakshi News home page

చిరు జల్లులతో ఉపశమనం

Published Mon, May 6 2024 3:40 AM

చిరు

రాయపర్తి : భానుడి భగభగతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఆదివారం కురిసిన చిరు జల్లులతో ఉపశమనం లభించింది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం వర్షానికి ఎక్కడ తడుస్తుందోననే రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్నలు తడవకుండా పరదాలు కప్పారు.

నేటి ప్రజావాణి రద్దు

కాళోజీ సెంటర్‌: కలెక్టరేట్‌లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, సిబ్బంది పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె కోరారు.

కడియం కావ్యను

ఎంపీగా గెలిపించాలి

రాయపర్తి: కాంగ్రెస్‌ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించి సీఎం రేవంత్‌రెడ్డికి గిఫ్ట్‌గా ఇద్దామని కాంగ్రెస్‌ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మొరిపిరాల, పెర్కవేడు, ఊకల్‌ గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని, నియంత పాలన కొనసాగించిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలని కోరారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ తొర్రూరు అధ్యక్షుడు జాటోత్‌ హామ్యానాయక్‌, పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, పెండ్లి మహేందర్‌రెడ్డి, చిర్ర మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు తీగల సాయలు, సుతారి యాదగిరి, దామోదర్‌, బండి కుమార్‌, ఊగ మునిత, యాకయ్య, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

జనసభను

విజయవంతం చేయాలి

నర్సంపేట : నర్సంపేటలో సోమవారం నిర్వహించనున్న జనసభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు కోరారు. ఈ మేరకు పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసభకు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌దామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. 75 సంవత్సరాల చరిత్రలో ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారతదేశాన్ని మొదటి మూడు వరుసల్లో నిలబెట్టగలిగే ఏకై క నాయకుడు నరేంద్రమోదీ అని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకుడు గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కంభంపాటి ప్రతాప్‌, పట్టణ అధ్యక్షుడు శీలం రాంబాబు, నర్సంపేట ఇన్‌చార్జ్‌ గుడిపూడి రాధాకృష్ణ, కౌన్సిలర్లు జుర్రు రాజు, బోడ గోల్యానాయక్‌, కవితవీరన్న, ఎస్సీ మోర్చా జిల్లా కోకన్వీనర్‌ కూనమల్ల పృథ్వీరాజ్‌, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, పట్టణ మాజీ అధ్యక్షుడు బాల్నె జగన్‌, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపెల్లి రాజు, గూడూరు సందీప్‌, నల్లబెల్లి మండల ఇన్‌చార్జ్‌ మల్యాల వినయ్‌ పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో

పాడి గేదె మృతి

పర్వతగిరి : విద్యుదాఘాతంతో పాడి గేదె మృతి చెందిన సంఘటన లాల్‌తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం వివరాల ప్రకారం.. లాల్‌తండాకు చెందిన బానోత్‌ మోతీలాల్‌ పాడిగేదె మేతకు వెళ్లింది. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సుమారు రూ.70వేల విలువ గల పాడి గేదె మృతి చెందడంతో రైతు కన్నీరు మున్నీరయ్యాడు.

లక్ష్మీపురంలో దుక్కిటెద్దు..

దుగ్గొండి : విద్యుత్‌ తీగలు తగిలి దుక్కిటెద్దు మృతి చెందిన సంఘటన లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన ముద్దం యుగేంధర్‌ తన వ్యవసాయ బావి వద్దకు మేత కోసం ఎద్దులను తీసుకెళ్లాడు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్తుండగా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై రూ.80 వేల విలువైన ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.

చిరు జల్లులతో ఉపశమనం
1/4

చిరు జల్లులతో ఉపశమనం

చిరు జల్లులతో ఉపశమనం
2/4

చిరు జల్లులతో ఉపశమనం

చిరు జల్లులతో ఉపశమనం
3/4

చిరు జల్లులతో ఉపశమనం

చిరు జల్లులతో ఉపశమనం
4/4

చిరు జల్లులతో ఉపశమనం

Advertisement
 
Advertisement