విస్సాకోడేరులో టీడీపీ నుంచి భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

విస్సాకోడేరులో టీడీపీ నుంచి భారీగా చేరికలు

Published Mon, May 6 2024 11:30 AM

విస్స

పాలకోడేరు: ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైఎస్సార్‌ సీపీకి జనాదరణ పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. వీరిలో ప్రధానంగా మహిళా కార్యకర్తలు ముందు వరసలో ఉన్నారు. ఆదివారం విస్సాకోడేరులో సర్పంచ్‌ బొల్లా శ్రీనువాసు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్‌ నర్సింహరాజు, నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఎమ్మల్సీ కవురు శ్రీనివాస్‌, డీఎసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి సమక్షంలో 200 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిని గూడూరి ఉమాబాల మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని, గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటారో తెలియదన్నారు. ఏ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచారో అదే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చరిత్ర ఆయనదని పరోక్షంగా రఘురామకృష్ణంరాజును ఉద్దేశించి విమర్శించారు. ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పీవీఎల్‌ నర్సింహరాజు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పీవీఎల్‌ను గెలిపించాలని ఉమాబాల కోరారు. బీసీ కులాలకు నరసాపురం పార్లమెంట్‌ సీటు కేటాయించి సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో గౌరవం కల్పించారని, మీ ఆడబడుచుగా భావించి తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్‌ నర్సింహరాజు మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కాకపోయినా ఐదేళ్లుగా నియోజవర్గంలోని 72 గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రెయిన్లు, వాటర్‌ వర్క్స్‌ సచివాలయాల నిర్మాణాలు పూర్తి చేయడానికి సహకారం అందించానన్నారు. జగనన్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే రెండు ఓట్లు ఫ్యాన్‌ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీలకు పెద్దపీట వేశారన్నారు. సర్పంచ్‌ బొల్లా శ్రీనివాస్‌, ఎంపీపీ భూపతి చంటిరాజు, సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, వైస్‌ ఎంపీపీ ఆదాడ లక్ష్మీ తులసి, పిన్నమరాజు సహదేవరాజు, పిన్నంరాజు శ్రీనివాసరాజు, పృధ్విరాజు, చేబోలు బాలాజీ డాక్టర్‌ స్వర్ణలత, గెడ్డం జోషి, ఆరేపల్లి శ్రీనివాస్‌, గంగిరాజు వీరవెంకట సత్యనారాయణ, సూరగాని తాతారావు, ఎంపీటీసీ బొల్లం గాంధీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విస్సాకోడేరులో టీడీపీ నుంచి భారీగా చేరికలు
1/1

విస్సాకోడేరులో టీడీపీ నుంచి భారీగా చేరికలు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement