పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు

Published Sun, May 5 2024 4:00 AM

పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు

సాక్షి, యాదాద్రి : రెండో విడత ర్యాండమైజేషన్‌ ద్వారా భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హనుమంతు కే.జెండగే, ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాబర్ట్‌సింగ్‌ క్షేత్రిమయుమ్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను కేటాయించారు. ఇందులో 25 శాతం అదనంగా బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, 40 శాతం అదనంగా వీవీ ప్యాట్లు ఉన్నాయి. మొత్తం 8,023 బ్యాలెట్‌ యూనిట్లు, 2,673 కంట్రోల్‌ యూనిట్లు, 2,994 వీవీ ప్యాట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టరు బెన్‌ షాలోమ్‌, భువనగిరి, మునుగోడు, నకిరేకల్‌, తుంగతుర్తి, జనగామ, ఇబ్రహీంపట్నం, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఆర్డీఓ అమరేందర్‌, డి.సుబ్రహ్మణ్యం, పూర్ణచందర్‌, బి.ఎస్‌. లత, డి.కొమరయ్య, కె.అనంతరెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ నాగేశ్వరాచారి, ఈడీఎం సాయి కుమార్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్‌ రూంలు ఇక్కడే..

ఇబ్రహీంపట్నం : ఖానాపూర్‌లోని గురునానక్‌ ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ టెక్నికల్‌ క్యాంపస్‌లో స్ట్రాంగ్‌ రూం ఏర్పాటు చేయనున్నారు.

మునుగోడు : చండూరు మండల కేంద్రంలోని డాన్‌ బాస్కో జూనియర్‌ కాలేజీ

భువనగిరి : అరోరా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీ

నకిరేకల్‌ : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ

తుంగతుర్తి : వ్యవసాయ మార్కెట్‌ గోదాము

ఆలేరు : ఇండోర్‌ స్టేడియం

జనగాం : సోషల్‌ వైల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఈవీఎంలను భద్రపరచనున్నారు.

నియోజకవర్గాల వారీగా..

ఫ 25 శాతం అదనంగా

బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు,

40 శాతం వీవీ ప్యాట్లు

పోలింగ్‌ బ్యాలెట్‌ కంట్రోల్‌ వీవీ ప్యాట్లు

కేంద్రాలు యూనిట్లు యూనిట్లు

ఇబ్రహీంపట్నం 343 1287 428 480

మునుగోడు 317 1,188 396 443

భువనగిరి 257 963 321 359

నకిరేకల్‌ 311 1164 388 435

తుంగతుర్తి 326 1221 407 456

ఆలేరు 309 1158 386 432

జనగాం 278 1042 347 389

Advertisement
 
Advertisement