సెక్టార్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

సెక్టార్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Published Sun, May 5 2024 4:00 AM

-

సాక్షి, యాదాద్రి : పోలింగ్‌ ప్రక్రియలో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమని, అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనమంతు కే.జెండగే సూచించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల సెక్టార్‌ అధికారులకు పోలింగ్‌ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని, మెడికల్‌ కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, వీల్‌ చైర్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లుగా గుంపులుగా రాకుండా చూడాలని, ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల సమన్వయంతో సమస్యలు ఎదురుకాకుండా పోలింగ్‌ పూర్తి చేయాలని పేర్కొన్నారు. పోలింగ్‌ ముందురోజు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు ఉదయమే చేరుకుని తమ రూట్లకు సంబంధించిన ప్రైసెడింగ్‌ ఆఫీసర్లతో కలిసి ఎన్నికల సామగ్రి తీసుకొని మధ్యాహ్నం లోపు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయమే 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ ప్రారంభించాలని, పోలింగ్‌ ఏజెంట్లు సకాలంలో హాజరయ్యేలా వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్‌ వివరాలు తెలియజేయాలని పేర్కొన్నారు. పోలింగ్‌ సిబ్బందికి కేటాయించిన వాహనాలకు జీపీఎస్‌ అమర్చనున్నట్లు వెల్లడించారు. ఈవీఎంలకు సంబంధించిన ఇంజనీర్లు, తహసీల్దార్లు, పోలీసు ఎస్‌హెచ్‌ఓల ఫోన్‌ నంబర్లను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఈవీఎం యంత్రాలను అమర్చడంపై మాస్టర్‌ ట్రైనర్లు నర్సిరెడ్డి, హరినాథ్‌రెడ్డి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement