వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

Published Mon, May 6 2024 10:20 AM

వైఎస్

మైదుకూరు : మైదుకూరు నాయకుడు బీఎన్‌ మాదన్న పెద్దకుమారుడు బీఎన్‌ మాధవరాయుడు ఆదివారం ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘు రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అంతకుముందు బీఎన్‌ మాధవ రాయుడు ఇంట్లో నిర్వహించిన తేనీటి విందులో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొన్నారు. మదీనా దస్తగిరి, శ్రీమన్నారాయణరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, దండు రామయ్య, భూమిరెడ్డి సుబ్బరాయుడు, కేపీ లింగన్న, గల్లా నరసింహారెడ్డి, బండి నాగేంద్ర ప్రసాద్‌, గోశెట్టి లక్షుమయ్య తదితరులు పాల్గొన్నారు.

50 కుటుంబాల చేరిక

చింతకొమ్మదిన్నె : కడప నగర పరిధిలోని 17వ డివిజన్లో గల అంగడి వీధిలో ఆదివారం కార్పొరేటర్‌ చంద్రహాస్‌ రెడ్డి, డివిజన్‌ ఇంచార్జ్‌ మట్లీ శ్రీనివాసులు రెడ్డిల ఆధ్వర్యంలో ఎర్రగుళ్ల వెంకటయ్య, ఎర్ర గొల్ల వెంకట శివకుమార్‌ నేతత్వంలో ఆదివారం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి సమక్షంలో 50 కుటుంబాల వారు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎర్రగుళ్ల శివప్రసాద్‌, దాసరి గణేష్‌, దాసరి వెంకటరమణ, ఇల్లపల్లి కార్తీక్‌, నాగ శివ, నాగవేణి, మల్లీశ్వరి, కష్ణ ప్రసాద్‌, గంగాధర్‌, హరి, శరత్‌ కుమార్‌, రాజు, పెంచలమ్మ, సుధారాణి, తదితరులు పార్టీలో చేరారు

ఓబుళంపల్లె నుంచి.. చింతకొమ్మదిన్నె మండలంలోని ఓబులంపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాల వారు టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలో ఆదివారం ఎమ్మెల్యే పి వీంద్రనాథ్‌ రెడ్డి, సీకే దీన్నే జెడ్పీటీసీ పి. నరేన్‌ రామాంజుల రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కార్యాలయంలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎన్‌, నాగార్జున రెడ్డి, జి.విశ్వనాథరెడ్డి, బి. మహేశ్వర్‌ రెడ్డి, బి.సురేష్‌ రెడ్డి, బి.రామకష్ణారెడ్డి, పి. శివ రెడ్డి, పి. నాయబ్‌ ఖాన్‌, ఎస్‌. సయ్యద్‌ హుస్సేన్‌, ఎస్‌. మౌలాలి, ఎస్‌. రహమతుల్లా, ఎస్‌. రసూల్‌ , ఎస్‌. నాయబ్‌, ఎస్‌. సద్దాం, పి. రసూల్‌, పి. నాగమల్లారెడ్డి, పి,రహమత్‌ ఖాన్‌, పి.మల్లేష్‌, పి. శివ చంద్రారెడ్డి , పి.శివ శంకర్‌ రెడ్డి ఉన్నారు. మండల కన్వీనర్‌ గూడా ప్రభాకర్‌ రెడ్డి, మాజీ కన్వీనర్‌ గుత్తిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గజ్జల సుధాకర్‌ రెడ్డి, ఎంపీటీసీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు

40 కుటుంబాల చేరిక

బద్వేలు అర్బన్‌: మండల పరిధిలోని తిరువెంగళాపురం పంచాయతీలోని తిరువెంగళాపురం, గాండ్లతిమ్మాయపల్లె, ఎత్తిరాజుపల్లె గ్రామాల నుంచి బిజివేములరామసుబ్బారెడ్డి, దుంపలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 40 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, మండల కన్వీనర్‌ మల్లేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ సుబ్బనరసింహ, ఉప సర్పంచ్‌ కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, చంద్రఓబుల్‌రెడ్డి, రామసుబ్బయ్య, వెంకటేష్‌, రామచంద్ర, శ్రీను, సామేలు, రమణయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజుపాలెంలో 10 కుటుంబాలు చేరిక

మండల పరిధిలోని రాజుపాలెం పంచాయతీ రాజుపాలెం గ్రామంలో టీడీపీకి చెందిన వాకమళ్ల సురేష్‌రెడ్డి, బుట్టివిజయనరసింహారెడ్డిలతో పాటు 10 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిరెడ్డి, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు బుట్టినరసింహారెడ్డి, ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, ఇన్‌చార్జిలు రమాదేవి, వెంకటసుబ్బారెడ్డి, రమణారెడ్డి, చిదానందంరెడ్డి, మల్లెంకొండంరాజు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

ప్రొద్దుటూరు : మండలంలోని చౌటపల్లె గ్రామానికి చెందిన టీడీపీ వారు ఆదివారం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. చౌటపల్లె గ్రామానికి చెందిన దేవిరెడ్డి హరిబాబురెడ్డి, గండ్లూరు రాంప్రసాద్‌రెడ్డి, దేవిరెడ్డి లక్ష్మిరెడ్డి, దేవిరెడ్డి మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి రామిరెడ్డి, మోపూరు ఉదయ్‌ కుమార్‌రెడ్డి, మోపూరు ఓబులరెడ్డి, గుమ్మల సుబ్బారెడ్డితోపాటు 30 కుటుంబాల వారికి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా రాచమల్లు శివప్రసాదరెడ్డిని, ఎంపీగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి విజయానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన వారు తెలిపారు.

వైఎస్సార్‌సీపీలోకి 60 కుటుంబాల చేరిక

పెద్దతిప్పసముద్రం: మండలంలోని మద్దయ్యగారిపల్లి పంచాయతికి చెందిన కొత్తకోట హరిప్రసాద్‌ ఆద్వర్యంలో 60 కుటుంబాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌సీపీలోకి చేరారు. తంబళ్ళపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ కండువాలతో వారిని సత్కరించారు. మండల బీసీ సంఘం అధ్యక్షుడు కే.ఓబులేసు, మాజీ ఎంపీటీసీ అంజప్ప, గ్రామ అధ్యక్షుడు భీమా, బూత్‌ కమిటి ఇన్చార్జ్‌ రవీంద్ర, శంకరప్ప, మణి, నాగరాజు, గుప్తా, ఆదినారాయణ,వెంకటేష్‌, అప్పిరెడ్డి, సురేష్‌, వెంకట్రమణ,మారుతి, సత్యం, మాబూ, అగ్గిరాముడు, శివన్న, రామచంద్ర, శ్రీనివాసులుతో పాటు మరో 40 కుటుంబాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిక కార్యక్రమానికి వందలాదిగా జనం తరలి వచ్చి ద్వారకనాథ్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు.

ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వైఎస్సార్‌సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టోకు ఆకర్షితులై కొందరు.. సీఎం జగన్‌ పాలన నచ్చి మరికొందరు ఇతర పార్టీల నుంచి వైఎస్సార్‌ సీపీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారు.

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ
1/4

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ
2/4

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ
3/4

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ
4/4

వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement