వందశాతం లక్ష్యంగా హోమ్‌ ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

వందశాతం లక్ష్యంగా హోమ్‌ ఓటింగ్‌

Published Mon, May 6 2024 10:25 AM

వందశాతం లక్ష్యంగా హోమ్‌ ఓటింగ్‌

రాయచోటి: జిల్లాలో హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది. శుక్రవారం నుంచి పలువురు వృద్ధులు ఇంటి వద్ద నుంచి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ హోమ్‌ ఓటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. హోమ్‌ ఓటింగ్‌ ఆప్షన్‌ను ఎంచుకున్న 714 మంది ఓట్ల వివరాలను సేకరించి ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది. హోమ్‌ ఓటింగ్‌ను ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృందం వెళ్లి బ్యాలెట్‌ పేపర్లను అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9782 మంది వృద్ధులు, పీడబ్ల్యుడీలు 18,153 మంది హోమ్‌ ఓటింగ్‌ అర్హత కలిగి ఉన్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 9782 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 18,153 మంది ఉన్నట్లు వారు తెలిపారు. వీరిలో కేవలం 714 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్ర, శనివారాలలో 458 మంది తమ ఓటు వినియోగించుకున్నారు.

Advertisement
Advertisement