-
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు
హైదరాబాద్, సాక్షి: రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఆయన విదేశాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే ఆ నోటీసులకు ప్రభాకర్ నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ట్రిప్ పేరుతో రాష్ట్రం దాటారు. ఆపై ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఆయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ఆయన అక్కడికి వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఇప్పటికే రెండు నెలలు ముగియడంతో.. మరో నాలుగు నెలల తర్వాతే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో సాక్ష్యాలను బట్టి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు.. ఐటీ చట్టాల ప్రకారం నిందితులపై కేసులకు అనుమతించాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ సైతం వేశారు. మరోవైపు ఇదే న్యాయస్థానంలో నలుగురు నిందితుల (ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు) బెయిల్ పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలవడనుంది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని సీపీ, ఇప్పటికే నిందితుల నుంచి సమాచారం పూర్తిగా దర్యాప్తు అధికారులు సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు ఇప్పటికే వినిపించారు. -
ఇంటికో సైనికుడు.. ఆర్మీ అంటే వీరికి ప్రాణం
యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం.. అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. నేటి యువత కూడా సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతోంది. ఇదీ.. మర్కూక్ మండలం గంగాపూర్ ప్రత్యేకత. ఇక్కడి ప్రజల జీవన విధానంపై ఈ ఆదివారం ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.. యెన్నెల్లి సురేందర్–గజ్వేల్: రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్‌పుత్’లతో గంగాపూర్ గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం 50కిపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ‘రాజ్‌పుత్’లో దేశభక్తి ఎక్కువ. అందువల్లే ఇక్కడి యువత సైన్యంలో చేరుతుంటారు. ఇప్పటికే 25మంది సైన్యంలో పనిచేస్తుండగా.. కొందరు పదవీ విరమణ పొందారు. గ్రామానికి చెందిన పంచిగారి యశ్వంత్ సింగ్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేస్తున్నారు. నోచోనియా భవానీసింగ్, పంచిగారి నరేష్సింగ్, పంచిగారి రూప్సింగ్, అత్తర్‌సుమ నర్సింగ్, జుగ్రాజ్ గణేష్‌సింగ్, నోన్‌వార్ గణేష్‌సింగ్, నోన్‌వార్ భవానీసింగ్, నోన్‌వార్ సత్యనారాయణసింగ్, రామ్చరణ్సింగ్లు ఆర్మీలో పనిచేస్తున్నారు. యూసుఫ్ఖాన్పల్లిలోనూ... ఈ గ్రామానికి ఆనుకొని ఉన్న యూసుఫ్ఖాన్పల్లిలోనూ మరో 20కుపైగా రాజ్‌పుత్‌ల కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి కూడా మరో 15మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. మిగతావారు వ్యవసాయం, ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గంగాపూర్ ప్రస్తుతం యూసుఖాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోకే వస్తుంది. రాజేంద్రనగర్ఎస్ఐగా.. ఇదే గ్రామానికి చెందిన జుగ్రాజ్ నారాయణసింగ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కాగా పంచిగారి రామ్‌సింగ్, అత్తర్‌సుమ అనంతరామ్సింగ్, నోచునోయి హిరామన్, అనంతరామ్సింగ్, అత్తర్‌సుమ రాజారామ్‌సింగ్, ప్రకాష్సింగ్లు సైతం ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరే కాకుండా మరో ఏడుగురికిపైగా సైన్యంలో విధులు నిర్వహిస్తున్నారు. మరికొంత యువకులు ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఉత్సాహంతో ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారం వ్యవసాయమే వీరికి జీవనాధారం. తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూమిలో సేద్యం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. యువత ఆర్మీలో చేరుతుండగా.. కొందరు స్థానికంగా కంపెనీలు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. నిరుపేదలు ఏటా రైతుల వద్ద భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తుంటారు. అలాగే కూలీపనులకు కూడా వెళ్తుంటారు. దేశ సేవంటే ఇష్టం మా ఊరు ఇచ్చిన ప్రేరణతోనే నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాను. చిన్నప్పటి నుంచి నాకు దేశ సేవంటే మహా ఇష్టం. నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. మా గ్రామంలో చాలా మంది ఆర్మీలో పనిచేస్తుండటం ఆనందంగా ఉంది. మా ఊరే అందరికీ ఆదర్శం. – పంచిగారి యశ్వంత్ సింగ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రాజస్థాన్ ఇక్కడివారితో కలిసిపోయాం తాతముత్తాలు గంగాపూర్‌కు వచ్చారు. ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడివారితో కలిసి పోయాం. వారే మాకు ఆత్మీయులు. ఏ వేడుక అయినా అందరం కలిసి చేసుకుంటాం. వ్యవసాయం జీవనాధారం. ఎంతోమంది పిల్లలు ఆర్మీలో చేరడం సంతోషం. – శంకర్‌సింగ్, గంగాపూర్ ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది దేశ సేవ చేసేందుకు ఆర్మీలో చేరడం గర్వంగా ఉంది. 2023లో ఆర్మీలో చేరాను. మా గ్రామంలో నాతోపాటు ఎంతోమంది ఉన్నారు. వారి సలహాలు, సూచనలతో ఉద్యోగంలో చేరి సేవ చేస్తున్నాను. – పంచిగారి నరేశ్ సింగ్, ఆర్మీ పైలెట్ శిక్షణ ఇస్తే మరింత మేలు దేశ సేవ చేసే అదృష్టం ఆర్మీలో దక్కుతుంది. మా గ్రామం నుంచి ఎక్కువ మంది ఆర్మీలో చేరడం గర్వంగా ఉన్నది. వారి స్ఫూర్తితో ప్రతి ఏటా కొందరు యువకుల ఆర్మీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – దుర్జన్‌సింగ్, ప్రైవేట్ లెక్చరర్, గంగాపూర్ -
Shivangi font testing
What is Lorem Ipsum?Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum. -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
రేవంత్ ఇంటి దగ్గర్లోనూ ఓ వార్‌రూమ్!
సాక్షి, హైదరాబాద్: ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబీకులు, అనుచరులపై నిఘా ఉంచడానికి ఓ గెస్ట్‌హౌస్ తీసుకున్నట్టు తెలిసింది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సమీపంలో ఉన్న దీంట్లో ప్రణీత్‌రావు వార్‌రూమ్ నిర్వహించాడు. ఈ గెస్ట్‌హౌస్ కేంద్రంగానే భారీ సెటిల్మెంట్లు కూడా జరిగినట్టు తెలిసింది. పోలీసు కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు విచారణలో ఈ విషయాలు గుర్తించిన అధికా రులు ఆదివారం రాత్రి ఆ గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేశారు. మరోపక్క రాధాకిషన్‌రావు కస్టడీ బుధవారంతో ముగి యనుండటంతో సిట్ అధికారులు తమ దర్యా ప్తు, విచారణ ముమ్మరం చేశారు. నిఘా అధికారులు చేసిన ఫోన్ ట్యాపింగ్ కారణంగానే 2015 నాటి ‘ఓటుకు కోట్లు’వ్యవహారం, 2022లో చోటు చేసుకున్న ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్‌రావు ఎస్ఐబీ చీఫ్‌గా మారిన తర్వాత ట్యాపింగ్ దుర్వినియోగం కావడం మొదలైంది. తొలినాళ్లలో ఈ విభాగం నిబంధనల ప్రకారమే అవసరమైన ఫోన్‌నంబర్లను లీగల్ ఇంటర్సెప్షన్గా (ఎల్ఐ) పిలిచే చట్టబద్ధమైన విధానం ద్వారానే ట్యాప్ చేసింది. అయితే 2018 ఎన్నికల నుంచి వీరి ట్యాపింగ్ పంథా మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఫోన్లతోపాటు సోషల్‌మీడియాను ట్యాప్ చేయాలని భావించారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, వేణుగోపాల్‌రావు తదితరులను ఎస్ఐబీలోకి తీసుకున్న తర్వాత, భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టడంతో ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ను కొత్త పుంతలు తొక్కించారు. దీనికోసం విదేశాల నుంచి ఉపకరణాలు, సాఫ్ట్వేర్స్ అక్రమంగా దిగుమతి అయ్యాయి. టెక్నాలజీ కన్సల్టెంట్ రవిపాల్ అలియాస్ పాల్ రవికుమార్ సహకారంతో ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్స్, ఎంసీ క్యాచర్స్ సమీకరించుకున్నారు. సూట్‌కేస్‌లో ఇమిడిపోయి ఉండే ఈ ట్యాపింగ్ పరికరం మ్యాన్ ఇన్ ది మిడిల్ (ఎంఐటీఎం) ఎటాక్స్‌కు వినియోగించారు. దీన్ని ప్రణీత్‌రావు టీమ్ ఓ వాహనంలో పెట్టుకొని టార్గెట్ చేసిన వ్యక్తి ఇల్లు, కార్యాలయ సమీపంలో మాటు వేసేది. ఈ పరికరానికి ఓ కృత్రిమ సెల్‌ఫోన్ టవర్గా మారిపోయి 300 మీటర్ల పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఫోన్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ తెలుసుకునే సామర్థ్యం ఉంది. వాటిలో తమకు కావాల్సిన దాన్ని ఎంచుకొని, దానికి సంబంధించిన సోషల్‌మీడియా సహా ప్రతి కమ్యూనికేషన్‌ను ట్యాప్ చేసే అవకాశం దానిని ఆపరేట్ చేసే వ్యక్తికి ఉంటుంది. ఇలాంటి ఓ ఉపకరణాన్నే ప్రణీత్‌రావు బృందం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో తీసుకున్న గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసింది. అక్కడ నుంచే రేవంత్‌తోపాటు ఆయన కుటుంబీకులు, ప్రధాన అనుచరుల ఫోన్లపై నిఘా ఉంచింది. రాధాకిషన్‌రావు, భుజంగరావులు ఇదే గెస్ట్‌హౌస్ కేంద్రంగా కొన్ని సెటిల్మెంట్లు కూడా చేశారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలను ప్రభాకర్‌రావు నేరుగా పర్యవేక్షించి భారీ వసూళ్లకు తెర లేపినట్టు పోలీసులు గుర్తించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement