సీఎం జగన్‌పై దాడి: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌పై దాడి కేసు: సతీష్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ విధింపు

Published Thu, Apr 25 2024 3:47 PM

Satish Remanded For Police Custody Over CM Jagan Incident - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఏ1గా ఉన్న సతీష్‌ను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించ్చింది.

ఈ నేపథ్యంలో సతీష్‌ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించనున్నారు. కాగా, న్యాయవాది సమక్షంలో సతీష్‌ను విచారించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో, ఈనెల 25, 26, 27 తేదీల్లో సతీష్‌ను పోలీసులు విచారించనున్నారు. ఇక, సీఎం జగన్‌పై సతీష్‌ రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. 

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై సతీష్‌ హత్యాయత్నానికి తెగబడ్డాడు. సీఎం జగన్‌ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్‌ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది.

రిమాండ్‌ రిపోర్టు ఇలా.. 
సీఎం జగన్‌పై దాడి కేసులో రిమాండ్‌ రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి కోసం నిందితులు పక్కాగా స్కెచ్‌ గీసుకున్నారన్న విషయం తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పాటు కాల్‌డేటా, సిసిటివి ఫుటేజ్‌లు అన్నీ పరిశీలించిన పోలీసులు.. నిందితులను గుర్తించారు. ఇందులో పొలిటికల్‌ కాన్‌స్పిరసీ (రాజకీయ కుట్ర) ఉందని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి కదలికలు స్పాట్‌లో ఉన్నట్లు నిర్ధారించారు. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడ్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

17వ తేదీన A1నిందితుడిని రాజరాజేశ్వరిపేటలో అరెస్ట్‌ చేసి సెల్‌ఫోన్‌ సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఏ2 ప్రోద్బలంతో.. నిందితుడు సతీష్‌ కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. సీఎంను చంపాలనే కుట్రతోనే సీఎం తల భాగంపై దాడి చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

కుట్ర ఎలా జరిగిందంటే?

  • ముఖ్యమంత్రిపై దాడి చేయాలని ముందస్తు పథకం వేసుకున్నారు.
  • ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు ఏ1 సతీష్‌ను ప్రేరేపించాడు.
  • ఈ కేసులో ఏ2 ఆదేశాలతో సీఎం జగన్‌ను హత్య చేయడానికి సతీష్ సిద్ధమయ్యాడు
  • సింగ్ నగర్‌ ప్రాంతంలో వివేకా నంద స్కూల్ దగ్గర నిందితుడు వెయిట్‌ చేశాడు
  • సీఎం జగన్‌ వచ్చే వరకు ఎదురు చూశాడు
  • దాడికి పదునుగా ఉన్న రాళ్లను ముందే సేకరించాడు
  • ప్యాంటు జేబులో రాళ్లను పెట్టుకుని నిందితుడు వచ్చాడు
  • నిందితుడి కాల్ డేటాలో కీలకమైన అంశాలు దొరికాయి
  • సీసీటీవీ ఆధారంగా కేసుకు సంబంధించి చాలా విషయాలు లభించాయి
  • ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం క్లియర్‌గా ఉంది
  • ఈ కేసులో ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించాం
  • సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశాం
  • 17వ తేదిన నిందితుడిని రాజరాజేశ్వరి పేటలో అరెస్టు చేసి సెల్ ఫోన్ సీజ్ చేశారు. 
     

Advertisement
Advertisement