ఓటీటీలో 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదేనా..? | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదేనా..?

Published Thu, Apr 25 2024 4:29 PM

Aadujeevitham Movie OTT Streaming Date Locked - Sakshi

మలయాళం హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ చిత్రం 'ఆడు జీవితం'. ట్రైలర్‌తోనే భారీ అంచనాలను పెంచేసిన ఈ సినిమా విడుదలైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మలయాళంలో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలో  చేరిపోయిన ఆడు జీవితం ఓటీటీ విడుదలకు రెడీగా ఉంది.

ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న బ్లెస్సీ 'ఆడు జీవితం' చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మే 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని వార్తలు వస్తున్నాయి.  డిస్నీ+హాట్‌స్టార్ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది. అగ్రిమెంట్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం, సినిమా విడుదలైన సమయం నుంచి 40 రోజుల తర్వాత  OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో  విడుదలచేయవచ్చు. దీని ప్రకారం మే 10న ఓటీటీలో ఆడు జీవితం విడుదల కానుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది.

 కథ ఏంటి..?
కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన నజీబ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్‌ నిర్మించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్‌ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం.

Advertisement
Advertisement