సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా? | Samantha Ruth Prabhu Shocking Pic Trending In Twitter, Is Actress Deleted The Post?| Sakshi
Sakshi News home page

Samantha Viral Photo: ట్రెండింగ్‌లో సామ్.. ఆ ఫొటోలో ఉన్నది ఎవరు?

Published Sun, May 5 2024 7:50 PM

Samantha Ruth Prabhu Shocking Pic Trending In Twitter

ఉన్నఫలంగా హీరోయిన్ సమంత గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ఓ మహిళ నగ్నంగా ఉన్న ఫొటోని వైరల్ చేస్తున్న నెటిజన్స్.. ఇందులో ఉన్న సమంతనే అంటున్నారు. ఈ ఫొటోని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేసిందని అంటున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అసలేం జరిగింది?

హీరోయిన్‌గా స్టార్ హోదా అనుభవించిన సమంత.. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని మూడేళ్ల క్రితం బయటపెట్టింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి, దాన్ని నుంచి కోలుకోవడానికి అవసరమైన చికిత్సలు తీసుకుంటోంది. కొన్నాళ్ల క్రితం అమెరికా కూడా వెళ్లొచ్చిందని అన్నారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)

తాజాగా సమంత.. 'ఫార్ ఇన్ఫ‍్రారెడ్ సౌనా' అనే చికిత్స తీసుకుంటున్నట్లు చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అలానే దీని వల్ల ఎలాంటి  ఉపయోగాలు ఉంటాయనేది కూడా రాసుకొచ్చింది. ఇదే టైంలో సమంత.. నగ్నంగా ఉన్న ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అది ఇదేనంటూ ఓ పిక్ వైరల్ చేశారు.

అయితే ఇందులో ఎవరో ఓ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అది సమంతనా కాదా అనేది మాత్రం తెలియలేదు. మెడలో ఉన్న చైన్ ఒక్కటే అని అంటున్నారు. కానీ ఆ ఫొటో ఫేక్ అని సామ్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో అసలు నిజమేంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)

Advertisement
Advertisement