కరెంట్‌ ఇవ్వడం కూడా కాంగ్రెస్‌కు చేతకావడం లేదు: కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

కల్యాణ లక్ష్మీ కింద తులం బంగారు ఇస్తామన్నారు.. ఏమైంది?: కేసీఆర్‌

Published Thu, Apr 25 2024 4:26 PM

KCR Road Show Starts From Miryalaguda Live Updates - Sakshi

మిర్యాలగూడలో రోడ్ షో ముగించుకుని సూర్యాపేట బయలుదేరిన కేసీఆర్

మనకు శత్రువే కాంగ్రెస్‌ పార్టీ: కేసీఆర్‌

  • మిర్యాలగూడలో కేసీఆర్‌ ప్రసంగం
  • అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది కాంగ్రెస్‌ పార్టీ
  • రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి అంటాడు
  • రైతులు చెప్పులు కూడా గట్టిగానే ఉన్నాయని కాంగ్రెస్‌ నేతలకు చెప్పా
  • తెలంగాణ వచ్చాక పంటలు ఎండాయంటే ఇదే తొలిసారి.
  • కరెంట్‌ కోతలెందుకు వస్తున్నాయి? ఎక్కడికి పోయింది కరెంట్‌? ఎందుకు ప్రజలను బాధపెడుతున్నారు.
  • కరెంట్‌ను ఇవ్వడం కూడా చేతకావడం లేదా?.
  • మిషన్‌ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు లేదు? అది మీ చేతకాని తనం కాదా?
  • కేసీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్‌ నేతలు పనిగా పెట్టుకుంది.
  • ధాన్యం కొనడం లేదని రైతులు చెబుతున్నారు.

తప్పకుండా తెలంగాణలో మన రాజ్యమే వస్తది.

  • 1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్సే.
  • 21 ఏళ్ల క్రితం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశా. 
  • నాలుగైదు నెలల క్రితం ధీమాతో ఉన్న రైతులు ఈరోజు బాధతో ఉన్నారు.
  • ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ జిల్లాకు చెందినవారే. వీళ్లంతా కలిసి కృష్ణా నదిని కేఆర్ఎంబీకి పంపించారు.
  • బీఆర్ఎస్ హయాంలో 18 పంటలకు నీళ్లిచ్చాం. 
  • రైతు బీమా ఉంటదో ఉండదో తెలవదు.
  • కరెంట్ కనిపించకుండా పోయింది.
  • రైతు బంధు ఐదెకరాలకే అంటున్నారు.
  • ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనడం లేదని రైతులు నాతో అన్నారు. 
  • కేంద్రం గతంలో ధాన్యం కొననంటే మెడలు వంచి కొనిచ్చాం
  • కల్యాణ లక్ష్మీ కింద తులం బంగారు ఇస్తామన్నారు.  ఇంతవరకు లేదు
  • రెండు లక్షల రుణమాఫీ ఏమైంది?
  • పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తే ప్రభుత్వం మెడలు వంచుతాం.
  • కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపిస్తా అంటున్నారు. వీటికి కేసీఆర్ బయపడతాడా?
  • అంబేడ్కర్‌ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది.
  • 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కడితే. జయంతి ఒక్కరు పోలేదు.

 

  • మిర్యాలగూడ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర
  • రోడ్ షోలో పాల్గొని రాజీవ్ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్న కేసీఆర్

 కాసేపట్లో మిర్యాలగూడకు చేరుకోనున్న కేసీఆర్‌

  • మిర్యాలగూడ బైపాస్‌ నుంచి రాజీవ్‌ గాంధీ కూడలి వరకు ర్యాలీ
  • రాజీవ్‌ గాంధీ కూడలిలో ప్రసంగిచనున్న కేసీఆర్‌

నల్లగొండ జిల్లా: 

  • బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద ఆగిన మాజీ సీఎం కేసీఆర్
  • ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర

  • కేసీఆర్ బస్సు వెంట భారీ కార్ల కాన్వాయ్ ర్యాలీ
  • మొదటిసారిగా తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి ​కేసీఆర్ బస్సు యాత్ర

సాక్షి, హైదరాబాద్‌/నల్గొండ:  బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చం‍ద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ నుంచి భారీ కాన్వాయ్‌ ర్యాలీ నడుమ బయల్దేరారు. తెలంగాణ భవన్‌ సౌత్‌ గేట్‌ నుంచి ఆయన కాన్వాయ్‌ బయల్దేరడం విశేషం. సాయంత్రం 4గం. మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 

ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. రైతుల కోసం, రాష్ట్రం కోసం 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు.  లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

కేసీఆర్‌ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్‌షోలలో పాల్గొంటారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు.

Advertisement
Advertisement