-
ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్ దోమకొండ/బీబీపేట: కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసిన మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్‌తో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలన్నారు. అవసరమైనన్ని లారీలను కేంద్రాలకు పంపాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని త్వరగా అన్లోడ్ చేసుకోవాలని రైస్‌మిల్లర్లకు సూచించారు. తహసీల్దార్లు, ఆర్ఐలు, సూపర్వైజరీ అధికారులు దగ్గరుండి కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్చార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, తహసీల్దార్ సంజయ్‌రావ్, సివిల్‌సప్లయ్ అధికారి కిష్టయ్య తదితరులున్నారు. -
‘దోస్త్’లో తొలి ప్రాధాన్యత ఇవ్వండి
కామారెడ్డి అర్బన్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశకోసం వె బ్ ఆప్షన్లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రిన్సిపాల్ కే.విజయ్‌కుమార్ విద్యార్థులను కోరారు. గురువారం ఆయన క ళాశాల 60 సంవత్సరాలుగా అందిస్తున్న బహుము ఖ విద్యాసేవలను వివరించే బ్రోచర్‌ను విడుదల చే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కా మారెడ్డి డిగ్రీ కళాశాలలో చదివినవారు ఐఏఎస్, ఐ పీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, గ్రూప్ వన్ అధికారు లు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఆర్మీ అధికారులు, డాక్టర్లు, న్యాయవాదులు, శాస్త్రవేత్తలు, టీచర్లు, పా రిశ్రామికవేత్తలు, నాయకులు, వృత్తి నిపుణులు, ఉ పాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. న్యాక్ ఏ గ్రే డ్ గుర్తింపుతో పాటు అటానమస్ కలిగి అనేక ప్రత్యే క కోర్సులున్నందున విద్యార్థులు ఈ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
‘కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలి’
కామారెడ్డి క్రైం: అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో గురువారం రెవె న్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మరో మూడు రోజు ల పాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం రాశుల ను ఎప్పటికప్పుడు తూకం వేసి మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అవస రమైన టార్పాలిన్లను రైతులకు అందించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. లారీలను 24 గంటలలోగా అన్లోడ్ చేసుకోవాలని రైస్‌మిల్లులకు సూచించారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 42,142 మంది రైతుల నుంచి రూ.526 కోట్ల విలువైన 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో రూ. 441 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మల్లికార్జున బాబు, ఇన్చార్జి డీఎం నిత్యానందం, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
వేధింపుల కేసులో డీఎంహెచ్‌వో అరెస్ట్
సాక్షి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌ను దేవునిపల్లి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయనపై ఏడు కేసులు నమోదయ్యాయి. ఆయనను గురువారం కోర్టు లో హాజరుపరిచామని కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వర్రావు తెలిపారు. న్యాయమూర్తి షరతు లతో కూడిన బెయిల్ ఇచ్చారన్నారు. డీఎంహెచ్ వో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్‌పైనా కేసు నమోదయ్యింది. అయితే ఆయనను ఇంకా అరెస్టు చేయలేదు.హైదరాబాద్‌కు బాధితులు.. డీఎంహెచ్‌వో వికృత చేష్టలకు పాల్పడుతున్నారంటూ జిల్లాలోని పీహెచ్సీలలో పనిచే స్తున్న మహిళా వైద్యులు ఇటీవల కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శితోపాటు ఎస్పీకి ఫి ర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ బుధవారం కా మారెడ్డికి వచ్చి విచారణ జరిపారు. వైద్యుల నుంచి వివరాలను నమోదు చేసుకుని వెళ్లిపోయారు. విచారణ జరిగిన మరుసటి రోజే వై ద్యులు ఉన్నతాధికారులను కలిసేందుకు హై దరాబాద్‌కు తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూతో పా టు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీసర్ రవీందర్ నాయక్‌లను కలిసి సమస్యను వివరించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు అందుబాటులో లేరని తెలిసింది. డీఎంహెచ్‌వో లైంగిక వేధింపుల వ్యవహారంపై రాష్ట్ర మ హిళా హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసును నీరు గా ర్చడానికి రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన మహిళా వైద్యులతోపాటు వారి భర్తలకు ఫోన్ చేసి రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటు న్న వైద్యాధికారిపై చర్యల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అంతర్గత ఫిర్యాదుల కమిటీతో విచారణ డీఎంహెచ్‌వో లైంగిక వేధింపుల వ్యవహారంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీతో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులకు గురైతే ఈ కమిటీ విచారణ జరుపుతుంది. జిల్లా సంక్షేమశాఖ అధికారి, ఐసీడీఎస్ పీడీతో పాటు మరో ఇద్దరు మహిళా అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్ర లేదా శనివారాల్లో బాధిత మహిళా వైద్యులతో పాటు, డీఎంహెచ్‌వో, సూపరింటెండెంట్లను వేరువేరుగా విచారించనుంది. అనంతరం విచారణ నివేదికను కలెక్టర్‌కు అందిస్తారు. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన కోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధిత వైద్యులు జిల్లాలో కలకలం రేపిన వైద్యాధికారి వ్యవహారం -
పేరుకే మండలం!
సొంత భవనాలేవి?తహసీల్ ఆఫీసులు మాత్రమే..సాక్షి, కామారెడ్డి : పరిపాలనా సౌలభ్యం పేరుతో ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. వాటి ఏర్పాటు కోసం అధికారిక ప్రక్రియ అంతా పూర్తి చేసి గెజిట్ కూడా విడుదల చేశారు. మంజూరైన మండలాల్లో తహసీల్ కార్యాలయాలను ప్రారంభించారు. ఆ తర్వాత అడుగులు మాత్రం ముందుకు పడడం లేదు. మండల పరిషత్ కార్యాలయాలు గానీ, పోలీసు స్టేషన్లు గానీ, మండల విద్యాశాఖ కార్యాలయాలు గానీ ఏర్పాటు కాకపోవడంతో ప్రజలు ఆయా సేవల కోసం పాత మండలాలకు వెళ్లాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. అప్పుడు ఏర్పాటు చేసిన మండలాలు, డివిజన్లు, జిల్లాల్లో అన్ని విభాగాలకు సంబంధించి కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కొన్నిచోట్ల సొంత భవనాలు నిర్మాణాలు మొదలుపెట్టినా మెజారిటీ మండలాలు, డివిజన్లలో ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలోనూ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ప్రజల నుంచి డిమాండ్లు రావడంతో అప్పటి ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం కొత్త మండలాలను ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో డోంగ్లీ, పల్వంచ, ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, పొతంగల్, మహ్మద్‌నగర్ మండలాలు ఏర్పాటయ్యాయి. డోంగ్లీ రైతు వేదికలో ఏర్పాటు చేసిన తహసీల్ కార్యాలయం ఉమ్మడి జిల్లాలో ఏడు కొత్త మండలాల ఏర్పాటు రెవెన్యూ సేవలు మాత్రమే అందుబాటులో.. ఇప్పటికీ ఏర్పాటు కాని పోలీసు స్టేషన్, మండల పరిషత్‌లు పూర్తి స్థాయి సేవలు అందేదెప్పుడో? ప్రభుత్వం పాలనను ప్రజలకు చేరువ చేయడానికి కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో బీబీపేట, రామారెడ్డి, రాజంపేట, పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, ఎర్గట్ల, మెండోరా, ముప్కాల్, ఇందల్వాయి, మోపాల్, రుద్రూర్, మోస్రా, చందూర్ తదితర మండలాలను ఏర్పాటు చేశారు. ఒకటి రెండుచోట్ల ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల భవనాలకు నిధులు మంజూరయ్యాయి. మిగతా మండలాల్లో ఎలాంటి నిధులు రాలేదు. దీంతో మండలాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలు, ఇతర శాఖలకు సంబంధించిన భవనాల్లో కార్యాలయాలను నడిపిస్తున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. ఇటీవలి కా లంలో ఏర్పా టు చేసిన కొ త్త మండలా ల్లో తహసీల్దార్ కార్యాలయాలను మాత్రమే ఏర్పాటు చే శారు. ఆ కార్యాలయాల లో భూములు రిజిస్ట్రేషన్లు చేప ట్టడం, అవసరమైన కుల, ఆదాయ, నివా స ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం వంటి పను లు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఉపాధి వంటి పనులకు సంబంధించి మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పాటు కాకపోవడంతో కొత్త మండలాల ప్రజలు పాత మండల కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. కొత్త మండలం ఏర్పాటుతో పాల న తమకు దగ్గరైందని మురిసిపోయిన ప్రజలు.. మండల పరిషత్ కార్యాలయం గానీ, పోలీసు స్టేషన్ కానీ ఏర్పాటు కాకపోవడంతో పాత మండల కేంద్రానికే వెళ్తున్నారు. విద్యాశాఖ కార్యాలయం కూడా ఏర్పాటు కాలేదు. మండల వ్యవస్థలో రెవెన్యూకు సంబంధించి తహసీల్ కార్యాలయం, అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలకు సంబంధించి మండల పరిషత్ కార్యాల యం, శాంతి భద్రతలకు సంబంధించి పోలీసు స్టే షన్, పాఠశాలలకు సంబంధించి విద్యా వనరుల కేంద్రాలు ఉంటాయి. వీటికి అనుబంధంగా మండ ల వ్యవసాయ అధికారి, మండల విద్యుత్ అధికారి (ఏఈ), మండల వ్యవసాయ అధికారి, నీటి పారుదల, పంచాయతీరాజ్, తాగునీటి పర్యవేక్షణకు సంబంధించి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఉంటా యి. కానీ కొత్త మండలాల్లో ఒక్క రెవెన్యూ సేవలు మాత్రమే అందుతున్నాయి. మిగతా సేవలకోసం పాత మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఆయా శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వడ్లకు బోనస్ ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే వడ్లకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ప్రకటించాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై గురువారం కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత హామీని మర్చిపోయిందన్నారు. ఇప్పుడు సన్న రకం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ మాట మారుస్తోందని ఆరోపించారు. రైతాంగానికి అన్ని రకాలుగా అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. వెంటనే దొడ్డు రకం వరి ధాన్యానికి కూడా రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని వడ్లకు బోనస్ ఇచ్చేంతవరకు పోరాడుతామన్నారు. ఆందోళనలో ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేంకుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నల్లవెల్లి అశోక్, కుంబాల రవి యాదవ్, గెరిగంటి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి రైతు ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ -
డెంగీ నివారణకు కదులుదాం
నిజామాబాద్‌నాగారం: డెంగీతో ఎంతో మంది మంచాన పడుతున్నారు.. మరికొంతమంది భయంతో చనిపోతున్నారు. జిల్లాలో డెంగీ కేసులు జనవరి నుంచి ఇప్పటి వరకు 115 నమోదయ్యాయి. గతేడాది 356 కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి నివారణకు జాగ్రత్తలు అవసరం. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా కథనం.. వ్యాధి లక్షణాలు ● డెంగీ వ్యాధి ఎడిస్ దోమ కుట్టడంతో వ్యాప్తి చెందుతుంది. ● తీవ్రమైన జ్వరం రావడం, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పులు వస్తాయి. ● కళ్ల వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, ఆకలి మందగించడం, శరీరంపై దద్దుర్లు రావడం, వికారం, వాంతులు. ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఎలీసా’ పద్ధతిలో జరిపే రక్త పరీక్ష ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారించవచ్చు. ● ఏడిస్ దోమలు ఎక్కువగా పగలు కుడతాయి. ఈ దోమలు ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ● నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయాలి. ● ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తోట్ల మీద మూతలు పెట్టాలి. ● ఇళ్లలోకి దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలి. ● ప్రభుత్వం డెంగీపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ● వ్యాధి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి నేడు అవగాహన ర్యాలీ జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రజ లకు అవగాహన కల్పించడానికి గురువారం అ వగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాం. దోమల నివా రణకు ప్రతి శుక్రవాం డ్రైడేగా పాటిస్తున్నాం. – తుకారాం రాథోడ్, ఇన్చార్జి డీఎంహెచ్‌వో -
జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్ల మధ్య గొడవ
● ఆలస్యంగా వెలుగులోకి ఘటన నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల మధ్య పది రోజుల క్రితం గొడవ జరగ్గా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూనియర్ డాక్టర్లు, బయట వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. జూనియర్ వైద్యుల మధ్య గొడవ జరగ్గా.. దీనిలోకి ప్రైవేట్ వ్యక్తులు వచ్చారు. దీంతో గంటపాటు వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది, నర్సులు ఆపే ప్రయత్నం చేసినా వాళ్లు వినలేదు. గొడవలో మహిళా జూనియర్ డాక్టర్లు కూడా ఉండడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తులతో ఉన్న సాన్నిహిత్యంతో గొడవ జరిగినట్లు సమాచారం. అధికారుల పర్యవేక్షణ లేకనే జీజీహెచ్‌లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. -
18న ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. ఈనెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్‌తో కలిపి 12 మంది కౌన్సిలర్లున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న చైర్మన్ కుడుముల సత్యనారాయణ లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్‌లో చేరిన రోజే అంటే గతనెల 24న 11 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌ను కలిసి అవిశ్వాసం నోటీస్ అందించారు. దీంతో ఎల్లారెడ్డి మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అవిశ్వాసం నోటీస్ ఇచ్చిన కౌన్సిలర్లంతా క్యాంపునకు తరలారు. ఏడాది కాలంగా మున్సిపల్ చైర్మన్‌పై కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. అప్పట్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అయి క్యాంపునకు వెళ్లారు. అయితే పార్టీ నాయకులు కౌన్సిలర్లను సముదాయించి అవిశ్వాసం ఆలోచనను విరమింపజేశారు. ఇటీవల చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో కౌన్సిలర్లు మరోసారి అవిశ్వాసానికి ప్రయత్నించారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన తరువాత 11 మంది క్యాంపునకు తరలివెళ్లారు. క్యాంపులో ఉన్న కౌన్సిలర్లందరూ ఒక్కటిగా ఉన్నట్టు తెలుస్తోంది. వారంతా అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి నేరుగా హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు క్యాంపులో 11 మంది కౌన్సిలర్లు -
కుల బహిష్కరణపై విచారణ
మోపాల్: మండల కేంద్రంలోని గోపు మహేశ్‌ను కుల బహిష్కరణ చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై గంగాధర్ బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు. బాధితుడు మహేశ్ మాట్లాడుతూ.. సుమారు 25 ఏళ్ల క్రితం తాను అరి సందు(ఖాళీ స్థలం) వదిలి ఇళ్లు కట్టుకున్నానని చెప్పారు. ఇంటి వెనకాల గల మున్నూరుకాపు సంఘానికి ప్రహరీ నిర్మించేందుకు కుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. తాను వదిలిన స్థలంలో (అరి సందు) తన గోడకు ఆనుకుని ప్రహరీ నిర్మిస్తామనడంతో అడ్డు చెప్పినట్లు తెలిపాడు. వారు చెప్పినట్లు వినడం లేదని సంఘం పెద్దలు కుల బహిష్కరణ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన తన తండ్రి గంగాధర్ మే 6న మృతి చెందాడన్నారు. ఈ విషయం కులం పెద్ద మనుషులకు సమాచారమిచ్చినా.. అంత్యక్రియలకు హాజరు కాలేదన్నారు. తన అక్కను గ్రామానికి చెందిన లచ్చన్నకు ఇచ్చి వివాహం చేశామని, వారిని కూడా అంత్యక్రియలకు రాకుండా అడ్డుకున్నారని మహేశ్ చెప్పాడు. రూ.50వేలు జరిమానా విధిస్తామని బెదిరించడంతో అక్క మాత్రమే అంత్యక్రియలకు వచ్చిందన్నారు. తనను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఆటో, బైక్ ఢీ : ఒకరికి గాయాలు
రెంజల్: మండలంలోని కిసాన్తండా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ సాయికుమార్ ద్విచక్ర వాహనంపై నవీపేట్ నుంచి కూనేపల్లి గ్రామానికి వస్తుండగా కూనేపల్లి నుంచి నవీపేట్‌కు వెళ్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో సాయికుమార్‌కు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు ఢీకొని ఒకరికి..మోపాల్: మండలంలోని మంచిప్ప శివారులో గల గండి మైసమ్మ దేవాలయం వద్ద జరిగిన రోడ్డు ప్ర మాదంలో సింగంపల్లికి చెందిన రషీద్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రషీద్ గ్రామాలు తిరుగుతూ పాత సామగ్రిని సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదే క్రమంలో బుధ వారం శ్రీరాం నగర్ తండాలో తిరిగి మంచిప్ప రో డ్డు పైకి వస్తుండగా గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో రషీద్‌కు తీవ్ర గా యాలయ్యాయి. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.రషీద్ బావ షేక్ గౌస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ నందిపేట్: మండలంలోని సీహెచ్ కొండూర్ ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌హౌస్ వద్ద గల సబ్‌స్టేషన్‌లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైంది. వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఎత్తిపోతల కమిటీ సభ్యులు పంపుహౌజ్‌లోని మోటార్లను పరిశీలించేందుకు మొదటి పంపుహౌజ్ వద్దకు వెళ్లారు. ప క్కనే గల సబ్‌స్టేషన్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ వ్య ర్థ సామగ్రి పడడంతో అనుమానం వచ్చి చూడగా ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి కాపరు వైరు, ఆయిల్ గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గమనించారు. సబ్‌స్టేషన్ బయట కాపర్ వైరు ఉండే సామగ్రి పడేశారు. తల్వేద ఎత్తిపోతల కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై రాహుల్‌ను సంప్రదించగాస్పందించలేదు. బోధన్‌లో మృతదేహం లభ్యంబోధన్టౌన్: బోధన్ శివారులోని బాబా గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి మృతదేహం లభిందని పట్టణ సీఐ వీరయ్య తెలిపారు. వివరాలు.. బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామానికి చెందిన శంకర్(45) ఈ నెల 8న ఇంట్లో నుంచి వెళ్లాడు. మంగళవారం రాత్రి పట్టణ శివారులో కుళ్లిన స్థితిలో శంకర్ మృతదేహం లభించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. శంకర్ ఫిట్స్ వచ్చి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శంకర్ కొద్దిరోజుల క్రితం బాబా గార్డెన్ వద్దగల హోటల్లో పనిచేశాడని చెప్పారు. మృతుడికి భార్య అమిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
భార్యపై దాడి చేసిన భర్తపై కేసు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డికి చెందిన ఉబ్బి పూజితపై దాడి చేసిన ఆమె భర్త సాయిబాబాపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ బుధవారం తెలిపారు. వివరాలు.. ఈ నెల 2న పూజిత, సాయిబాబా మధ్య గొడవ జరిగింది. దీంతో సాయిబాబా తన భార్య పూజితపై పైపుతో దాడి చేసి గాయపర్చాడు. పూజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి వద్ద పీడీఎస్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్, దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న దాదాపు పది క్విటాంళ్లు బియ్యం పట్టుకున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఆటో డ్రైవర్, క్లీనర్‌ను ఆదుపులోకి తీసుకుని విచారణ జరుతున్నట్లు పేర్కొన్నారు. -
ఆలయ మాన్యాలను పరిరక్షించాలి
నిజామాబాద్ రూరల్: ఆలయ మాన్యాలను పరిరక్షించాలని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ సూచించారు. భూములను ఫొటోలు తీయించి, వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలని ఆలయ అర్చకులకు సూచించారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో బుధవారం కోటగిరి, వర్ని, రుద్రూర్, ఇందల్వాయి, మాక్లూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, నందిపేట్, మోస్రా, నందిపేట్ మండలలోని గ్రామాలకు చెందిన పూజారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ధూపదీప నైవేధ్య పథకం ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు గుర్తింపు కార్డులు అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సెక్షన్ 43 ప్రకారం ఆయా ఆలయాలను రిజిస్ట్రేషన్, పబ్లికేషన్ చేయించుకోవాలని సూచించారు. -
రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: మే నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ శుక్రవారం వరకు కొనసాగనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సెలవులు వచ్చినందున రేషన్ పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా.. పంపిణీని రెండు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయురాలికి తుది షోకాజ్ నోటీస్ జారీ కామారెడ్డి టౌన్: విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశాలకు వెళ్లిన బీబీపేట మండలం శివరాంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీరంగం సుహాసినికి తుది షోకాజ్ నోటీస్ జారీ అయ్యింది. ఈ విషయాన్ని డీఈవో రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరంగం సుహాసిన 2021 అక్టోబర్ నుంచి 2023 జూలై వరకే అనుమతి తీసుకున్నారని పేర్కొన్నారు. జూలైనుంచి విధులలో చేరాల్సి ఉన్నా.. ఇప్పటివరకు చేరకపోవడంతో చట్టపరమైన చర్యల కోసం తుది షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి బాన్సువాడ రూరల్: డిగ్రీ కళాశాలలో ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈనెల 20 నుంచి 30వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని పట్టణంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ సూచించారు. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) షెడ్యూల్లో ఉన్నత విద్యామండలి మార్పులు చేసిందన్నారు. ముందుగా ప్రకటించన ప్రకారం బుధవారం నుంచే వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల నుంచి వినతులు రావడంతో షెడ్యూల్లో సవరణలు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. మెప్మా ఆర్పీ రాజీనామాఆర్మూర్టౌన్: ఆర్మూర్‌కు చెందిన మెప్మా ఆర్పీ గంగామణి తన ఉద్యోగానికి రాజీనా మా చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్ని కల్లో భాగంగా ఈనెల 13న పట్టణంలోని బాలుర పాఠశాలలోని బూత్ నంబర్ 54లో విధులు నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి వచ్చి తన పై ఆగ్ర హం వ్యక్తం చేశారని, కించపరిచేలా మాట్లా డారని.. అందుకే ఆర్పీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కా ర్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజుకు రాజీనామా లేఖను అందజేశారు. అందరి ముందు తనతో దురుసుగా ప్రవర్తించి బయటకు పంపడంతో అవమానకరంగా భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. -
రోడ్డెక్కిన అన్నదాత
● ధాన్యం కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో ● గంటన్నర పాటు స్తంభించిన ట్రాఫిక్నిజాంసాగర్: ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. బుధవారం మహమ్మద్‌నగర్ మండల కేంద్రంతో పాటు కోమలంచ గేటు వద్ద రాస్తారోకో చేశారు. బాన్సువాడ– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రెండు చోట్ల రైతులు సుమారు గంటన్నర పాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వారం రోజులుగా ధాన్యం తూకం వేయడం లేదని ఆరోపించారు. ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు రావడం లేదని, దీంతో కొనుగోలు కేంద్రంలో నిల్వలు పేరుకుపోతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు కడ్తా పేరిట రైస్‌మిల్లర్లు తమను దోచుకుంటున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు పంపాలని, ధాన్యం తూకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై సుధాకర్ రైతుల వద్దకు వచ్చి మాట్లాడారు. విషయాన్ని ఫోన్ ద్వారా జిల్లా సివిల్ సప్లై అధికారి, బాన్సువాడ ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లారు. ధాన్యం కొనుగోలు చేస్తామని, బస్తాల తరలింపునకు కావాల్సిన లారీలు పంపిస్తామని పేర్కొన్నారు. మహమ్మద్‌నగర్ తహసీల్దార్ క్రాంతికుమార్ రైతుల వద్దకు వచ్చి, తాను దగ్గరుండి తూకం వేయిస్తానని, లారీల్లో ధాన్యం బస్తాలను తరలించేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోలో రైతులతోపాటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సాదుల సత్యనారాయణ, గంగారెడ్డి, విఠల్‌గౌడ్, రవి గౌడ్, పోలీస్ రాజు, మిడుత సాయిలు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మద్యం వ్యాపారుల సిండికేట్ దందా
కామారెడ్డి క్రైం: ఓవైపు వేసవి తాపం, మరోవైపు ఎన్నికల హడావుడితో మద్యం దుకాణాలు, బార్లకు గిరాకీ పెరిగింది. ఇదే అదనుగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి, నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. మద్యం ప్రియులు ఎక్కువగా ఇష్టపడే కంపెనీలవి కాకుండా ఎక్కువ లాభం వచ్చే కంపెనీల బీర్లను దొడ్డిదారిన విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. కమీషన్లు ఎక్కువగా ఇచ్చే కంపెనీలకు చెందిన మద్యం బాటిళ్లు మాత్రమే చాలావరకు వైన్‌షాప్‌లు, బార్లలో దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని బార్లు బీర్ ధరలు అమాంతం పెంచేశాయి. దీంతో బీరుప్రియుల జేబుకు చిల్లు మరింత పెరిగింది. అప్పటికీ కోరుకున్న బ్రాండ్ బీరు దొరక్క తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా ఎకై ్సజ్ శాఖ చోద్యం చూస్తూ కూర్చుందనే విమర్శలున్నాయి. అమ్మిందే తాగాలి.. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు కింగ్‌ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లు విక్రయించడం లేదని అక్కడి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎవరూ ఫిర్యాదు వరకు వెళ్లకపోయినా కామారెడ్డి జిల్లాలోనూ అదే పరిస్థితి నెలకొంది. సాధారణంగా కింగ్ ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లనే యువత ఎక్కువగా ఇష్టపడతారు. కానీ వైన్‌షాప్‌లు, బార్లలో ఈ బ్రాండ్ బీర్లను అందుబాటులో ఉంచడం లేదు. చాలావరకు మద్యం దుకాణాలలో బీర్లకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నారు. దీంతో వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే బీర్ తయారీ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించాయని, గోదాం నుంచి తక్కువ స్టాక్ ఇస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో జనం ఇష్టపడని కంపెనీల బీర్లను అంటకడుతున్నారు. కింగ్ ఫిషర్ కంపెనీ బీర్లు దొరక్క యువత బేజారవుతోంది.అడ్డదారుల్లో.. కొరత పేరిట వైన్షాప్లలో నోస్టాక్ బోర్డులు ధరలు పెంచేసి ఇష్టారాజ్యంగా విక్రయాలు లాభం ఎక్కువగా వచ్చే బీర్ల అమ్మకానికి ప్రాధాన్యత మద్యంప్రియుల జేబులకు చిల్లు చోద్యం చూస్తున్న ఎకై ్సజ్ అధికారులువైన్షాప్లకంటే బార్లలో చార్జీల పేరిట గతంలో ఒక్కో బీర్ బాటిల్‌పై రూ.20 అదనంగా వసూలు చేసేవారు. ప్రస్తుతం కొరత సాకుతో ఎమ్మార్పీపై రూ.30 నుంచి రూ. 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మద్యం దుకాణాలకు వచ్చే బీర్లను అదే దుకాణంలో విక్రయించాలి. కామారెడ్డిలో కొందరు వ్యాపారులకు బార్లతో పాటు వైన్‌షాప్‌లు కూడా ఉన్నాయి. వైన్‌షాప్‌లకు వచ్చే సరుకును అక్కడి నుంచి గుట్టుగా బార్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బార్లలో అధిక ధరకు విక్రయించి అదనపు సొమ్ము సంపాదించవచ్చని ఇలా చేస్తున్నారు. అంతేకాకుండా బార్లలోని మద్యం బాటిళ్లను బయటకు విక్రయించకూడదు. కానీ కామారెడ్డిలో బార్లనుంచి యథేచ్ఛగా బయటికి ఇస్తున్నారు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత కూడా బార్లనుంచి ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుగుతున్నాయి. అయినా ఎకై ్సజ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.కొరత ఉన్నది వాస్తవమే ò³§ýlª MýS…ò³-±ÌS ¯]l$…_ çÜÆý‡$MýS$ ™èlMýS$P-Ð]lV> Æ>Ð]lyýl…, ÐólçÜÑÌZ ½ÆŠ‡-ÌSMýS$ yìlÐ]l*…yŠæ ò³Æý‡VýS-yýl…™ø MöÆý‡™èl E¯]l²¨ ÐéçÜ¢-Ð]lÐól$. Ð]l_a¯]l ÝëtMŠS¯]l$ A°² §ýl$M>-×êÌSMýS$ çÜÐ]l*-¯]l…V> ç³…^èl$-™èl$-¯é²…. yìlÐ]l*…yŠæ E¯]l² ½ÆŠ‡ÌS ÑçÙ-Ķæ*°² E¯]l²-™é-«¨-M>-Æý‡$ÌS §ýl–íÙŠ-ి- ¡çÜ$MýS$Ððl-âêÏ…. »êÆŠ‡ÌS ¯]l$…_ Ð]l$§éÅ°² ºÄ¶æ$-rMýS$ AÐ]l$Ã-MýS*yýl§ýl$. °º…«§ýl-¯]l-ÌS¯]l$ GÐ]lÆý‡$ A†{MýS-Ñ$…-_¯é ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sê…. – విక్రం కుమార్, ఎకై ్సజ్ ఎస్సై, కామారెడ్డి -
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాలు, సహకార శాఖల అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలువలు లేకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైస్‌మిల్ యజమానులు వెంటవెంటనే అన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని, రవాణా కోసం లారీల సంఖ్య పెంచాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మల్లికార్జున బాబు, ఇన్చార్జి డీఎం నిత్యానందం, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని పలువురు సింగిల్ విండో చైర్మన్ కోరారు. మంగళవారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలలో వేల సంఖ్యలో బస్తాలు తూకం పూర్తి చేసుకుని మిల్లులకు తరలించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. లారీలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వెంటనే లారీలను తెప్పించి, ధాన్యాన్ని తరలించాలని కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు నల్లవెల్లి అశోక్, తిరుపతి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశం -
కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు
నిజాంసాగర్(జుక్కల్): యాసంగి పంట నూర్పిళ్లు చేసి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం కుప్పలు పోసిన రైతులు విక్రయాలకు తిప్పలు పడుతున్నారు. తూకం చేసిన ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. లారీలు రాక రైస్ మిల్లులకు ధాన్యం బస్తాలు తరలించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 334 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వరిధాన్యం సేకరణ చేపడుతున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 2.3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించారు. లక్షకు పైగా మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలకు సిద్ధంగా ఉంది. గడిచిన 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం విక్రయాలు సక్రమంగా ముందుకు సాగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన వరిధాన్యం బస్తాల తరలింపునకు లారీలు రాకపోవడంతో తూకాలు మందకొడిగా సాగుతున్నాయి. అంతే కాకుండా రైస్ మిల్లుల్లో ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోవడంతో రైస్ మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. వరిధాన్యం బస్తాల లోడ్‌తో వెళ్తున్న లారీలు వారం రోజుల పాటు ఖాళీ కాకపోవడంతో లారీల కొరత తీవ్రంగా ఉంది. అంతే కాకుండా మిల్లర్లు కడ్తా పేరిట బస్తాకు రూ.2 కిలోలు తరుగు ఇస్తే ధాన్యం బస్తాలను తీసుకుంటామని షరతులు విధిస్తున్నారు. వారం రోజులుగా నిలిచిన కొనుగోళ్లు నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల్లోని మాగి, వెల్గనూర్, ఆరేడ్, బ్రాహ్మణపల్లి, హసన్‌పల్లి, మహమ్మద్ నగర్, బూర్గుల్, తుంకిపల్లి, కొమలంచ, గాలీపూర్, ముగ్థుంపూర్ గ్రామాల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వారం రోజులుగా తూకాలు అర్థంతరంగా నిలిచాయి. ఆయా కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు తరలించకపోవడంతో హమాలీలు తూకాలను నిలిపి వేశారు.గున్కుల్ కొనుగోలు కేంద్రం వద్ద నిల్వ ఉన్న ధాన్యం బస్తాలు లారీలు రావు.. రైస్ మిల్లులకు ధాన్యం బస్తాలు పోవు పట్టించుకోని సొసైటీల నిర్వాహకులు, అధికారులువడ్లు అమ్మి వారం రోజులైంది వడ్లు అమ్మి వారం రోజులవుతున్నా ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. లారీలు రాకపోవడంతో రాత్రింబవళ్లు ధాన్యం బస్తాల వద్ద కాపాలా ఉంటున్నా. ఐదు ఎకరాల్లో పంట పండించినా తిప్పలు కాలేదు కానీ వడ్ల బస్తాల కాడ కాపలా ఉండాలంటే దు:ఖం వస్తుంది. – మొట్ట అంజయ్య, రైతు గున్కుల్ అమ్ముకోవడం మరో ఎత్తు ఆరుగాలం కష్టపడి పంట పండించడం ఒక్క ఎత్తైతే వ డ్లు అమ్ముకోవడం మరో ఎ త్తు. వారం రోజుల కిందట 858 బస్తాలు కాంటా పెట్టించి రైస్ మిల్లుకు లారీ పంపించినా. ఇప్పటికి రైస్ మిల్లులో లారీ ఉంది కాని బస్తాలను ఖాళీ చేసుకోలేదు. ఇంకా కొనుగోలు కేంద్రంలో 175బస్తాలు ఉన్నాయి. అధికారులు స్పందించాలి. – రియాజ్, రైతు, కోమలంచ -
నేను పక్కా లోకల్
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ రూరల్: ‘‘ఎన్నికలు వస్తుంటా యి, పోతుంటాయి. బయటి నాయకులు ఓ ట్లు కాగానే వాళ్ల ఊళ్లకు వెళ్లిపోతారు. నేను మాత్రం లోకల్. బాన్సువాడనే నా ఊరు, ఇ క్కడే నా ఇల్లు.. బాన్సువాడ ప్రజలే నా కు టుంబ సభ్యులు’’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని ఇమ్రాన్ టీ స్టాల్లో స్థానిక నాయకులతో కలిసి టీ తాగారు. స్థానికులతో ముచ్చటించారు. టీ తాగి ఇంటికి వెళ్తుండగా.. రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటున్న మహిళ ఆయనను మాట్లాడించింది. మామిడి పండ్లను ఆయన కు అందించింది. ఎన్నికల పనుల్లో నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గడిపిన ఎమ్మెల్యే.. పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో మంగళవారం పట్టణంలో పర్యటించి సరదాగా గడిపారు. -
ఎగిరేది కాషాయ జెండానే
● జహీరాబాద్‌లో లక్ష మెజారిటీ ఖాయం ● పార్లమెంట్ ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి బిచ్కుంద : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవ ర్గంలో బీజేపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ నియోజకవర్గ ప్రభారి పెద్దోళ్ల గంగారెడ్డి, జిల్లా అధ్యక్షురా లు అరుణతార పేర్కొన్నారు. మంగళవారం బి చ్కుందలోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ గెలుపును అడ్డుకోవడాని కి కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేయించారని, కేసులు నమోదు చేయించా రని ఆరోపించారు. అయినా దాడులకు భయపకుండా బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రజలు కాషా య పార్టీకే మద్దతుగా నిలిచారన్నారు. కార్యకర్తల కృషితో బీబీ పాటిల్ లక్ష పైచిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి శ్రీధర్ పంతు లు, మండల అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు శివాజీ, విష్ణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నియోజకవర్గాలవారీగా పోలైన ఓట్ల వివరాలు..
నియోజక వర్గం పురుషులు పోలైన మహిళలు పోలైన ఇతరులు పోలైన మొత్తం మొత్తం శాతం ఓట్లు ఓట్లు ఓట్లు ఓట్లు పోలైన ఓట్లు జుక్కల్ 99,524 77,140 1,03,354 76,715 09 00 2,02,887 1,53,855 75.83 ఎల్లారెడ్డి 1,06,881 82,590 1,16,144 90,337 02 01 2,23,027 1,72,928 77.54 కామారెడ్డి 1,22,474 86,121 1,32,514 96,198 19 06 2,55,007 1,82,325 71.50 బాన్సువాడ 93,762 72,850 1,03,051 78,660 13 06 1,96,826 1,51,516 76.98 నారాయణ్‌ఖేడ్ 1,18,859 88,921 1,18,373 83,584 09 03 2,37,241 1,72,508 72.71 అందోల్ 1,22,668 96,859 1,28,187 94,461 05 00 2,50,860 1,91,320 76.27 జహీరాబాద్ 1,37,694 1,03,616 1,37,866 96,981 02 00 2,75,562 2,00,597 72.80 మొత్తం 8,01,862 6,08,097 8,39,489 6,16,936 59 16 16,41,410 12,25,049 74.63 -
‘ఎప్పటికప్పుడు వడ్లు తరలించాలి’
కామారెడ్డి క్రైం : మరో రెండు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రాత్రి పూట కూడా లారీలలోకి లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ చంద్ర మోహ న్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్, క్యాఽసంపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, పాల్వంచ మండలం భవానీపేటలోని రైస్‌మిల్లులను మంగళవారం ఆయన పరిశీలించారు. మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం రాశులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని తెలిపారు. మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటలలోగా అన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుంచి రూ.526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ.441 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీటీలు పాల్గొన్నారు. -
బిడ్డ కోసం బీజేపీతో ఒప్పందం
● మాజీ సీఎం కేసీఆర్‌పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శలు ● జహీరాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపని ధీమాకామారెడ్డి టౌన్ : మాజీ సీఎం కేసీఆర్ తన కూతు రు కవిత బెయిల్ కోసం బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ బీజేపీకి అమ్మేశారన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేశారని ఆరోపించారు. దీంతో ఆ రెండు పార్టీలు ఒకటేనని తేలిపోయిందన్నారు. కేసీఆర్‌కు సెక్యులరిజంపై మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవబోయే 11 స్థానాల్లో జహీరాబాద్ ఉంటుందని సీఎం చెప్పార న్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేశ్ షెట్కార్‌కు కామారెడ్డిలో బంపర్ మెజారిటీ వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో కామారెడ్డి నియోజకవర్గంలో 10,420 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని షబ్బీ ర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల చొప్పున ప్రభుత్వం రూ.15 కోట్లు విడుదల చేస్తే అందులో రూ.10 కోట్లకుపైగా కామారెడ్డి రైతులకు అందనుందన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డికి కామారెడ్డి ప్రాంత సమస్యలపై వినతి పత్రం ఇచ్చానని, వాటిని పరిష్కరిస్తామని ఆయన చెప్పారని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, నాయకులు పాల్గొన్నారు. -
ధాన్యం నిల్వలు ఉంచొద్దు
కామారెడ్డి క్రైం : సహకార సంఘా ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం ఽనిల్వలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో సహకార సంఘాల అధికారులు, నిర్వాహకులతో దాన్యం నిల్వలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న దాన్యం బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. అకా ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మలిఖార్జున్ బాబు, సివిల్ సప్లయ్ కార్పోరేషన్ ఇన్చార్జి డీఎం నిత్యానందం, సహకార సంఘాల అధికారులు పాల్గొన్నారు. -
వైద్యాధికారిపై వేటు పడేనా?
కామారెడ్డి టౌన్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై బుధవారం విచారణ జరగనుంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ విచారణ జరపనున్నారు. కలెక్టరేట్లోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లాలోని పీహెచ్‌సీల మహిళా మెడికల్ ఆఫీసర్లతో పాటు వైద్యాధికారులు రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌తో పాటు ఫిర్యాదు చేసిన పీహెచ్‌సీల మహిళా మెడికల్ ఆఫీసర్లు, వైద్యాధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.వివాదాస్పద నేపథ్యం.. డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్‌పై పలు ఆరోపణలున్నాయి. కాంట్రాక్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది పోస్టుల భర్తీలో డీఎంహెచ్‌వో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవినీతి వ్యవహారంలో ఆన్లైన్ లావాదేవీలపై సాక్ష్యాలతో కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతో అప్పట్లో విచారణ జరిపారు. అయితే ఆ ఫైలు ముందుకు కదలడం లేదు. ఓ ప్రజాప్రతినిధి సాయంతో వేటు పడకుండా తప్పించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైద్యులు, ఉద్యోగుల డిప్యుటేషన్లలో కూడా సదరు వైద్యాధికారి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఈనెల 8వ తేదీన జరిగిన ఓ సమావేశంలో ‘అసలు వైద్యులు విధులు నిర్వహిస్తున్నారా.. లేక వ్యభిచారం చేస్తున్నారా’ అంటూ డీఎంహెచ్‌వో మహిళా వైద్యులతో అనుచితంగా మాట్లాడడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై వైద్యులంతా సీరియస్ అయ్యారు. డీఎంహెచ్‌వో లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని 21 మంది వైద్యులు రాష్ట్ర అధికారులతో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నరగా సదరు అధికారి మహిళా వైద్యులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, ఆస్పత్రుల తనిఖీల సమయంలో మహిళా వైద్యులను బ్యాడ్ టచ్ చేస్తుంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును రాష్ట్ర అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో డీఎంహెచ్‌వోను సస్పెండ్ చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సీరియస్ అయినట్లు సమాచారం.మహిళా అధికారితో విచారణకు డిమాండ్ లైంగిక వేధింపుల ఘటనలో మహిళా అధికారులతో విచారణ చేపట్టాలని జిల్లా వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంతో మంగళవారం కలెక్టర్‌ను కలిసేందుకు కొందరు మహిళా వైద్యులు కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెళ్లిపోయారు. విచారణకు వచ్చే పురుష అధికారి వద్ద తమ బాధను ఎలా చెప్పుకోవాలని వారు పేర్కొంటున్నారు. మహిళా అధికారులతో విచారణ జరిపించాలని కోరుతున్నారు. లైంగిక వేధింపుల ఘటనలో నేడు డీఎంహెచ్‌వోపై విచారణ డీఎంహెచ్‌వో, ఫిర్యాదుదారులు హాజరు కావాలని ఆదేశం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: కశ్మీర్లో కనిపించని కమలం!
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్‌లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement